Roja : టీడీపీ కార్యకర్తల నోరు లేస్తే తాము చేతులతో సమాధానం చెబుతామని మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు.  సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేసే మంచి పనులను  ప్రతిపక్ష‌ నాయకుడు చంద్రబాబు అడ్డుకుంటున్నారని రోజా మండిపడ్డారు.  జగన్మోహన్ రెడ్డి 18 మందికి ఎమ్మెల్సీలు ఇస్తే అందులో 14 మంది బీసీ, ఎస్సీ, మైనారిటీ కులాల వారికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి వారిని గౌరవించడం జరిగిందన్నారు. వెనుకబడిన కులాల వారికి ఎమ్మెల్సీల‌ పదవులు ఇవ్వడం  చూసి ఓర్వలేని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని చెప్పారు.                     


గన్నవరం ఘటనపై చంద్రబాబు నాయుడు, మరికొందరు నాయకులు హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని, పోలీసులు గుండాలుగా ప్రవర్తించారని, దౌర్జన్యం చేశారని, వైసీపి గుండాలు రెచ్చి పోయారని మాట్లాడారని, తెలుగుదేశం పార్టి అధికారంలో ఉన్న సమయంలో దౌర్జన్యం, గుండాయిజంకు, సైకోయిజంకు కేరాఫ్ అడ్రస్ గా చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలే ఉన్నారని మండిపడ్డారు.  కర్నూలు జిల్లా, పత్తికొండలో నారాయణ రెడ్డిని కేఈ.కృష్ణమూర్తి తమ్ముడు తన అనుచరులతో కలిసి చంపేస్తే ఏ విధంగా చంద్రబాబు వారిని కాపాడారో ప్రజలందరికి తెలుసునని, అలాగే వనజాక్షిని ఇసుక వేసి చింతమనేని కొడితే తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులకు కేసు పెడితే పోలీసులను అడ్డుపెట్టుకుని, తన నాయకులతో రౌడీయిజం చేసి సెటిల్మెంట్ చేసిన ఒక దౌర్భాగ్యమైన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి విమర్శించారు.                               


అలాగే ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన దగ్గర నుండి  అసెంబ్లీలో తనను రూల్స్ కి వి రుద్ధంగా పార్టీ నుంచి ఒక సంవత్సరం పాటు సస్పెండ్ చేసిన ఘటన వరకూ,అలాగే పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల్లో 29 మంది అమాయకుల ప్రాణాలను బలి కొని పోలీసులను తనకు అనుకూలంగా మలుచుకుని ఆ కేసు నుండి ఎలా ఎస్కేప్ పోయాడు అన్నది రాష్ట్ర ప్రజలందరూ గమనించారన్నారు.  ఏపీ రాష్ట్రంలో టిడిపిని, చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, భవిష్యత్తులో చంద్రబాబు ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితిలో లేదన్నారు.. చంద్రబాబు తన వద్దన్న సైకోలతో, నాయకులతో, గుండాలతో పేదవారికి సహాయం చేస్తున్న జగన్ ను దూషించడం ఎంతవరకు సమంజసం అన్నారు.                        


ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేయాలని టిడిపి గుండాలు ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రంలో టిడిపిని ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తే ఆంధ్ర నుండి పారిపోయి హైదరాబాదులో ఇల్లు పెట్టుకున్నారని, అదే విధంగా 2024లో ప్రజలు హైదరాబాదులో కూడా చంద్రబాబుని ఉండనివ్వరన్నారు. పనికి మాలిన వెధవలతో, పైసాకి పనికి రాని వెధవలతో వైసిపి ఎమ్మెల్యేలను, మంత్రులను నాయకులను తిట్టించడం సమంజసం కాదన్నారు.  లోకేష్ పాదయాత్రకి తాము ఎప్పుడు అడ్డంకులు సృష్టించలేదని, లోకేష్ తన నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ టిడిపి నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టి తన ఇంటి పైకి పంపించాడని దీన్నిబట్టే చంద్రబాబు, లోకేష్ ఎటువంటి వారో అర్ధం అవుతుందన్నారు.