Republic Day 2024 LIVE: ఏపీలో గణతంత్ర వేడుకలు - జెండా ఎగరేసిన గవర్నర్

Republic Day 2024 LIVE Updates: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జ‌రుగుతున్నాయి.

ABP Desam Last Updated: 26 Jan 2024 09:59 AM

Background

Republic Day 2024 in Vijayawada: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నిర్వహిస్తోంది. అందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు నిన్ననే పూర్తి అయ్యాయి. గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ జెండా వందనం...More

Republic Day 2024 LIVE: విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకలు- ప్రభుత్వ పనితీరు వివరించిన గవర్నర్‌

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్రవేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగరవేసిన గవర్నర్ నజీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలను పరిశీలించారు. భద్రతా బలగాలు పరేడ్‌ నిర్వహించాయి. అందరూ గవర్నర్‌కి గౌరవందనం చేశాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్‌తోపాటు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.