పెంటపాడు: కోర్టు వద్దంటున్నా కొంతమంది ఉద్యోగులు చేసిన ఓవరాక్షన్ వారి సస్పెన్షన్ కు దారి తీసింది. ఇది జరిగింది ఎక్కడో కాదు ఏపీ లోని పశ్చిమగోదావరి జిల్లాలోనే.

Continues below advertisement

 తాడేపల్లిగూడెం సమీపంలోని పెంటపాడు మండలం ప్రత్తిపాడు వద్ద ఒక ఆలయ నిర్మాణం వివాదం చాలా కాలంగా కొనసాగుతోంది. ప్రతిపాడు గ్రామంలో ప్రతిమాంబ సమేత సదాశివ ఆలయ నిర్మాణం తీవ్ర వివాదానికి దారి తీసింది. మొత్తం 15 సెంట్లలో  గుడి నిర్మాణం జరుగుతోంది. అయితే ఆ భూమి ప్రభుత్వ భూమి అంటూ అదే గ్రామానికి చెందిన ఇద్దరు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. దానితో వెంటనే అధికారులు చర్యలు చేపట్టి ప్రభుత్వ భూమిని రక్షించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను పట్టించుకోని క్షేత్రస్థాయి ఉద్యోగులు ఆలయం నిర్మాణం జరుగుతున్నా చలించలేదని కోర్టు ఆర్డర్ ను సైతం పట్టించులేదని పిటిషన్ వేసిన వ్యక్తులు మరోసారి ఆరోపించారు. పైపెచ్చు తమపై కక్ష సాధింపులుపైపెచ్చు తమపై కక్ష సాధింపు చర్యలకు కూడా దిగారని మరో పిటిషన్ వేశారు.

ఈలోపు ఆలయ నిర్మాణం పూర్తవడమే కాకుండా ఏకంగా విగ్రహాలను కూడా ఆలయంలో పెట్టేశారు. ఈ విషయాలన్నీ పేర్కొంటూ మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు ఫిర్యాదుదారులు. అంతే కాకుండా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ను ప్రతివాది గా చేర్చారు. దానితో అసలు విషయం ఏంటి అంటూ విచారణ జరిపిన కలెక్టర్ నాగరాణి క్రింద ఉద్యోగులు చేసిన నిర్వాకం తెలుసుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Continues below advertisement

MRO సహా నలుగురు ఉద్యోగుల సస్పెన్షన్ 

కోర్టు ఆర్దర్స్ విషయం లో అజాగ్రత్తగా ఉండడమే కాకుండా లీగల్ గా మరిన్ని చిక్కులు వచ్చే పరిస్థితి తెచ్చిన పెంటపాడు MRO సహా EO PRD, ప్రత్తిపాడు పంచాయితీ కార్యదర్శి, VRO లను సస్పెండ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్.అలాగే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడం లో విఫలమైన తాడేపల్లిగూడెం గూడెం రూరల్ సీఐ, పెంటపాడు SI లపై చర్యలు తీసుకోవాలని జిల్లా SP కి సూచించారు. మరోవైపు ఈ కేసులో పిటిషన్ దారు గా ఉన్న చిటికిన రామచంద్ర రావు 10 సంవత్సరాలనుండి కోర్టు కేసు నడుస్తుండగా కోర్ట్ ను కూడా లెక్క చేయకుండా ఆలయ కమిటీ, ప్రభుత్వ ఉద్యోగులు ఆలయ నిర్మాణం చేపట్టారని ఫిర్యాదు చేసినందుకు తన షాపు కు కరెంట్ కట్ చేయడం వంటి చర్యలతో కేసును వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేసినట్టు ఆరోపించారు. ఏదేమైనా ప్రత్తిపాడు లాంటి చిన్న ఊరిలోని ఆలయ నిర్మాణం వివాదం ఏకంగా కలెక్టర్ నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసే వరకూ వెళ్లడం స్థానికం గా సంచలనం సృష్టిస్తోంది.

అసలు ఆ భూమి ఎవరిది?

ప్రస్తుతం ఆ భూమి ఎవరిది అన్న చర్చ నడుస్తోంది. జిల్లా పరిషత్ రెవెన్యూ పంచాయతీ శాఖలు ఈ భూమి తమది కాదని చెప్పగా  నీటి పారుదల శాఖ నుండి ఇంకా జవాబు రావాల్సి ఉంది.  మరోవైపు ఈ ఆలయ నిర్మాణం జరుగుతున్న భూమిని  ఆనుకుని ఒక పిటిషనర్ ఇల్లు ఉంది. ఆలయం నీడ తమ ఇంటిపై పడుతుందంటూ ఆయన ఆరోపిస్తున్నారు. ఆలయ కమిటీ ఆ భూమిని తమకు అమ్మేయమని అడగ్గా ధర దగ్గర పేచీ వచ్చింది. అది తేలకుండానే నిర్మాణం పూర్తి చేయడం తో ఆయన కోర్టుకు వెళ్లారు. మరోవైపున ఆలయాన్ని ఆనుకుని వ్యవసాయ భూమి ఉంది.

ఆలయ నిర్మాణం వల్ల  తమ పొలానికి నీరు రాకుండా ఆగిపోతోంది అని అవుతుందని  ఆ వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి యజమాని అడ్డు చెబుతున్నారు. వీటన్నిటిపై జనవరి ఐదున  కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈలోపులోనే హడావుడి గా ఆలయంలో దేవత విగ్రహాలు చడీ చప్పుడు లేకుండా పెట్టడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పై స్పందించిన కలెక్టర్  MRO సహా నలుగురు ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ప్రత్తిపాడు గ్రామంలోని ఆలయ పరిసరాల్లో 164 సెక్షన్ విధించి ఎవరూ అక్కడికి రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు..