Montha Cyclone News Updates | అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తుపాను తరువాత తీసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు సూచించింది. తీరం దాటిన తర్వాత కూడా మొంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఇప్పుడు మరింత అప్రమత్తత అవసరమని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

Continues below advertisement

• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు మాత్రమే త్రాగాలి.

• విరిగిన విద్యుత్ స్తంభాలు, వదులుగా ఉండే తీగలు /తెగిన తీగలు మరియు ఇతర పదునైన వస్తువుల నుండి జాగ్రత్తలు తీసుకోండి.   

Continues below advertisement

• అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు, మిమ్మల్ని షెల్టర్/ఆశ్రయం లొ ఉంచినట్లయితే అధికారులు చెప్పేవరకు  తిరిగి వెళ్ళవద్దు.

• దెబ్బతిన్న/ పడిపోయిన, పాత భవనాల్లోకి ప్రవేశించవద్దు.

• దెబ్బతిన్న విద్యుత్ పరికరాలను/వస్తువులను వాడే ముందు వాటిని ఎలక్ట్రీషియన్ చేత తనిఖీ చేయించాలి.

తుపాను బాధితులకు అత్యవసర సరకులు

అమరావతి: మొంథా తుపాను ప్రభావ ప్రాంత ప్రజలకు అత్యవసర సరకుల పంపిణీకి ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుపాను బాధితులకు అత్యవసర ఆహార వస్తువులు ఉచితంగా పంపిణీ చేయాలిని.. ప్రభావిత కుటుంబాలు, మత్స్యకారులకు సరకులు ఉచితంగా అందించాలని ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యకారులకు 50 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. కిలో కందిపప్పు, లీటర్ నూనె, కిలో చక్కెర, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళదుంపలు పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సరకుల పంపిణీ ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ కు ఆదేశం. ఉల్లిపాయలు, కూరగాయల సరఫరా బాధ్యతలను మార్కెటింగ్ కమిషనర్ కు అప్పగించారు.

రాత్రి తీరం దాటిన తుపాను..

మొంథా తీవ్ర తుపాను మంగళవారం రాత్రి 11:30 గంటల నుంచి 12:30 మధ్య మచిలీపట్నం- కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో  తీరాన్ని దాటింది. ప్రస్తుతం తుపాను తీవ్రత తగ్గుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కానీ 24 గంటలపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
 
మొంధా తుపాను ప్రభావంతో అంతర్వేది, పల్లెపాలెం, కాసుదాసుపాలెంలో  రోడ్ల మీద పడిన చెట్లు , ఇంటి రేకులు తొలగిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
 
తుపాను తీరం దాటడంతో ఉప్పాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. రాకాసి అలల ధాటికి ఉప్పాడ-కాకినాడ బీచ్‌ రోడ్డు ధ్వంసమైంది. ఉప్పాడ సూరాడపేట, మాయపట్నం, కోనపాపపేట గ్రామాల తీరం కోతకు గురైంది. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఉప్పాడ, అమీనాబాద్‌, కోనపాపపేట పునరావాస కేంద్రాలు మినహా ఇతర కేంద్రాలు తొలగిస్తున్నారు. మత్స్యకారులు ఇళ్లలోకి చేరిన వ్యర్థాలను శుభ్రం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.