Godavari Floods : గోదావరి ఉగ్రప్రవాహం రాజమహేంద్రవరంలోనూ దడ పుట్టిస్తోంది. రాజమహేంద్రవరం పుష్ప ఘాట్ వద్ద సుమారు 56 అడుగులకి నీటిమట్టం చేరుకుంది. కోటిలింగాల ఘాట్ శంకర్ ఘాట్ దుర్గా ఘాట్ గణపతి ఘాట్ మార్కండేయ ఘాట్, కుమారిఘాట్ ఇస్కాన్ ఘాట్ గాయత్రి ఘాట్ విఐపి ఘాట్ అన్ని ఘాట్ లో పోలీస్ సిబ్బందిని నియమించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గోదావరి నదికి లంక భూముల్లో నివాసం ఉండి జీవనం సాగించే చాపలు వేటగాళ్లు లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలను సురక్ష ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు.
పోలవరం ప్రాజెక్టు గేట్ల ద్వారా దిగువకు నీరు - తొలి సారి ఆపరేట్ చేసిన అధికారులు
గోదావరి ప్రవాహం ఏ మాత్రం తగ్గే పరిస్థితి లేకపోవడం ..పైగా మరింత పెరుగుతుందన్న సూచనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం లో ఆలయాలు ఇప్పటికే నీట మునిగాయి. వరద ప్రభావం పై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష సమావేశం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ మాధవిలత. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నీటి మట్టం 15.10 అడుగులకు చేరింది. దీంతో అధికారులు 15 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ప్రమాదకరంగా కడెం ప్రాజెక్టు, 64 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరద - చుట్టుపక్కల ఊర్లన్నీ ఖాళీ!
వరద నీటి ప్రవాహంతో విలీన మండలాలు జలదిగ్బంధంలో ఉండిపోయాయి. వరద నీరు రహదారులపై పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు పునరావాస కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక వరద బాధితులుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. కాజ్‌వేలపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాలతో పాటు క్యాచ్ మెంట్ ఏరియాలోనూ భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ సారివరద ఏ స్థాయిలో వస్తుందో అధికారులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అందుకే ఎలాంటి పరిస్థితి ఎదురైనా తట్టుకునేందుకు అధికారులు జాగ్రత్తలుతీసుకుంటున్నారు.
హైదరాబాద్ రోడ్లపై ప్రయాణిస్తున్నారా, వర్షం నీళ్లు నిలిచిపోయే ఏరియాలు ఇవే
ఉభయ గోదావరి జిల్లాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాటుపడవలపైనే ప్రజలు ప్రయాణం సాగిస్తున్నారు.రాజమండ్రి పట్టణంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఏర్పరుచుకున్న వారిని సహాయ పునరావాస శిబిరాలకు తరలించారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.