Ratan Tata Innovation Hubs: ఆంధ్రప్రదేశ్‌లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (RTIH) లను  రాష్ట్రంలో ఆవిష్కరణ, స్టార్టప్‌లు, నైపుణ్య అభివృద్ధి, , ఉపాధి సృష్టిని ప్రోత్సహించే లక్ష్యంతో  ఏర్పాటు చేస్తున్నారు.  ఈ హబ్‌లు రాష్ట్రంలో సిలికాన్ వ్యాలీ తరహా ఇకోసిస్టమ్‌ను సృష్టించడానికి రూపొందించడానికి ప్లాన్ చేశారు.   రాజమండ్రి  బొమ్మూరు ప్రాంతంలో ఈ ఇన్నోవేషన్ హబ్ నిర్మాణం జరుగుతోంది.  విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం వంటి ఇతర నగరాలతో పాటు రాజమండ్రి ఒక కీలక కేంద్రంగా ఎంపికైంది. ఈ హబ్‌ను  ఈ నెలలోనే ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం  చేశారు. 

స్కిల్ డెవలప్‌మెంట్, స్టార్టప్‌ల ప్రోత్సాహం కోసం ఈ హబ్ ఒక కేంద్రంగా పనిచేయనుంది. యువతకు నైపుణ్య శిక్షణ అందించడం, వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం ,  ఉపాధి అవకాశాలను సృష్టించడం ఈ హబ్ ప్రధాన లక్ష్యాలు. ఈ ప్రాజెక్టులో ** గ్రీన్‌కో ఎనర్జీ ,  ONGC ,  GAIL , అవంతి గ్రూప్ వంటి ప్రముఖ సంస్థలు గవర్నింగ్ కమిటీలో భాగస్వాములుగా ఉన్నాయి.   స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం ద్వారా ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని భావిస్తున్నారు.  రాజమండ్రిని ఒక స్టార్టప్   కేంద్రంగా మార్చడంలో ఈ హబ్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.  

ఇన్నోవేషన్‌ సెంటర్‌ నిర్వహణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక  బాధ్యత  కింద దిగ్గజ పారిశ్రామిక సంస్థలు నిధులు సమకూరుస్తాయి. వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, పోటీతత్వం వంటి వాటిలో  ట్రైనింగ్  ణ ఇస్తారు. పౌర సేవలందించే ప్రభుత్వ కార్యక్రమాలలోనూ ఆర్‌టీఐహెచ్‌ భాగస్వామ్యం అవుతుంది. భవిష్యత్తు టెక్నాలజీలైన క్వాంటమ్‌, ఆర్టిఫిషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి వాటిల్లో స్టార్ట్‌పలకు సహకారం అందిస్తుంది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లోనూ, ఆక్వా, మెరైన్‌ రంగాల్లోనూ సేవలు అందిస్తుంది.  టెక్స్‌టైల్‌ ఇన్నోవేషన్‌, అపెరల్‌, ప్రత్యామ్నాయ ఫైబర్‌, ఇంధనం, క్లీన్‌టెక్‌, పునరుత్పాదక ఇంధన రంగాలు, లైఫ్‌సైన్స్‌, ఫార్మా అండ్‌ హెల్త్‌ రంగాలలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని ప్రభుతవం చెబుతోంది. 

పట్టణ రవాణా, సముద్ర రవాణా, సామాజిక వ్యాపారం, గ్రామీణ ఔత్సాహిక మహిళా పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు శిక్షణను ఇస్తుంది. ఏపీలో ఐదు సంవత్సరాల్లో 20,000 స్టార్టప్‌లను  ఏర్పాటు చేస్తారు. ఇందులో తయారీ, సాంకేతిక వ్యవసాయం, టెక్స్‌టైల్స్‌, డిజిటల్‌, క్లీన్‌ ఎనర్జీ, ఆరోగ్య రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఒక్కో స్టార్ట్‌పలోనూ రూ. 10 లక్షల నుంచి కోటి రూపాయల దాకా మొత్తంగా రూ. 1,000 కోట్ల పెట్టుబడులు సమీకరిస్తారు. ఈ స్టార్ట్‌పల్లో మహిళలకు, యువత, నైపుణ్యం కలిగినవారికి ప్రాధాన్యం ఇస్తారు. స్టార్ట్‌పలతో వచ్చే ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను కల్పించాలని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది.