చిన్న చిన్న కేసులకు, క్రైమ్‌లకు యావజ్జీవ శిక్షలు వేస్తే వందలకోట్ల రూపాయలు తిని ప్రజాధనాన్ని లూటీ చేసిన చంద్రబాబును అడ్డంగా రోడ్డు మీద పెట్టి ఎందుకు ఉరితీయకూడదని ప్రశ్నించారు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. చంద్రబాబు స్కాంలన్నిటిని దర్యాప్తు సంస్థలు బయటకు తీయాలని, ఆయన అవినీతి సంపాదను తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకి జమ చేయించాలని డిమాండ్‌ చేశారు.


స్కాంలు ఏ రకంగా చేయవచ్చో స్కిల్స్‌ను ప్రదర్శించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని, ఆయన రాజకీయ ప్రస్థానం, జీవితం అంతా స్కామ్‌లమయం అని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. రెండెకరాలతో ప్రారంభమైన జీవితం నుంచి అతి తక్కువ కాలంలో ఏ రకంగా వేల కోట్ల రూపాయలకు అధిపతి అయ్యారని ప్రశ్నించారు రాజా. పోలవరం ప్రాజెక్టునుంచి అమరావతి వరకు ఈఎస్‌ఐ నుంచి స్కిల్‌ డెవలప్మెంట్‌ కార్పోరేషన్‌ వరకు అన్ని డిపార్ట్‌మెంట్లులో కూడా చంద్రబాబు దోపిడీ కొనసాగిందన్నారు. ఎక్కడ ఎలా దోచుకోవాలో అన్న ఏకైక అజెండాతో చంద్రబాబు పని చేశారని ఆరోపించారు. అందుకే 2019 ఎన్నికల్లో చంద్రబాబు డిప్ప మీద రెండు కొట్టి 23 స్థానాలకు పరిమితం చేశారన్నారని ఎద్దేవా చేశారు. ఆఖరికి 23లోనూ కూడా నలుగురు దూరమైన పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్తానమంతా అవినీతిమయమేనన్నారు.


ఏటీఎంలా పోలవరం ప్రాజెక్టు


పోలవరం ప్రాజెక్టుకు అన్ని క్లియరెన్స్‌లు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది, ప్రాజెక్టుకు అయ్యే ప్రతీ పైసా కేంద్రం ఖర్చు పెడుతుందని చట్టం చెబుతుంటే... తానే నిర్మిస్తానని చంద్రబాబు తీసుకోవడాన్ని రాజా తప్పుపట్టారు. పోలవరం నేనే నిర్మిస్తా.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నిధులు ఇచ్చేయండని అడిగారని నరేంద్రమోదీ చెప్పిన కామెంట్స్ గుర్తు చేశారు. ఇలా అడగడం వెనుక కేవలం పోలవరం ఏటీఎం మాదిరిగా చంద్రబాబు ఉపయోగించుకుని కాంట్రాక్టుల దగ్గర ఎప్పుడు డబ్బులు కావాలంటే తీసుకున్నారన్నారు.


రాజధాని పేరుతో రియల్‌ఎస్టేట్‌ 


అమరావతి పేరుతో చంద్రబాబు ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ మాదిరిగా స్వలాభం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు రాజా. చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయం వెనుక ఆయన, ఆయన సన్నిహితులు లాభపడ్డారన్నారు. ప్రతీ శాఖలోనూ చంద్రబాబు అవినీతి మార్కు కనిపిస్తుందన్నారు.


అవినీతి స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ తన కుమారుడికి చంద్రబాబు నేర్పించారన్నారు రాజా. 370 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యక్తిని రోడ్డుపై అడ్డంగా ఎందుకు ఉరితీయకూడదని ప్రశ్నించారు. పుష్కరాల సమయంలో పబ్లిసిటీ స్టంట్‌తో 28 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. ఏదో కమిషన్‌ వేశామని పేరుతో కమిషన్‌కు ఎటువంటి వివరాలు ఇవ్వకపోగా మమ అనిపించి మూసేశారన్నారు రాజా. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆనాటి సంఘటనను తిరిగి దర్యాప్తు చేయిస్తామని రాజా వెల్లడించారు.