Andha Pradesh Topers In UPSC CSE Final Result 2024: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుది ఫలితాల్లో పిఠాపురానికి చెందిన చెక్కా స్నేహిత్‌ విజేతగా నిలిచాడు. ఆయనకు ఆల్ ఇండియా స్థాయిలో 94వ ర్యాంకు సాధించాడు. స్నేహిత్ మ్యాథ్స్‌ను ఆప్షన్ సబ్జెక్ట్‌గా రాసిన స్నేహిత్‌ విజయం సాధించాడు. స్నేహిత్ తండ్రి చక్కా వెంకట్ స్థానిక అన్నపూర్ణ థియేటర్ య‌జ‌మాని. తల్లి మాథురి కుముదిని గుంటూరు సీనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు. స్నేహిత్ ప్రాథమిక విద్య పిఠాపురం ఆదర్శ విద్యాలయలో సాగింది. అనంతరం ఇంటర్ వరకూ గుంటూరు భాష్యం విద్యాసంస్థల్లో కొనసాగింది. గాంధీన‌గ‌ర్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.  

మొదటి నుంచి సివిల్స్‌ సాధనే ధ్యేయంగా స్నేహిత్ ప్రిపేర్ అయ్యాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు, ఇంటర్వ్యూలకు సొంతంగానే సిద్దపడినట్లు స్నేహిత్ తెలిపాడు. సివిల్ సర్వీసెస్ ద్వారా పేదలకు, దేశానికి సేవ చేయాలన్నదే తన లక్ష్యంగా స్నేహిత్ తెలిపాడు. తొలి ప్ర‌య‌త్నంలోనే స్నేహిత్ పిఠాపురం నుంచి యుపీఎస్‌సీలో విజ‌యం సాధించ‌డం ప‌ట్ల పిఠాపురం వాసులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏప్రిల్ 22 (మంగళవారం)న సివిల్ సర్వీసెస్ పరీక్ష (CSE) తుది ఫలితాలు ప్రకటించింది. ఈ ఫలితాల్లో శక్తి దూబే మొదటి ర్యాంక్ సాధించారు. హర్షిత గోయల్ రెండో స్థానంలో ఉంటే, డోంగ్రే అర్చిత్ పరాగ్ మూడో స్థానంలో నిలిచారు.

టాప్ 10లో ఉన్న ఇతర అభ్యర్థులు షా మార్గి చిరాగ్, ఆకాష్ గార్గ్, కోమల్ పునియా, ఆయుషి బన్సాల్, రాజ్ కృష్ణ ఝా, ఆదిత్య విక్రమ్ అగర్వాల్, మాయనక్ త్రిపాఠి.

UPSC ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి - ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. మూడు దశల్లో అభ్యర్థుల పనితీరు ఆధారంగా తుది మెరిట్ జాబితా తయారు చేస్తారు. 

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామక ప్రక్రియ ద్వారా 1,129 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS)లో 180 పోస్టులు, ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS)లో 55, ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో 147 పోస్టులు ఉన్నాయి.సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ 'ఎ'లో 605 ఖాళీలు, గ్రూప్ 'బి' సర్వీసెస్‌లో 142 ఖాళీలు ఉన్నాయి.

ఇతర ముఖ్యమైన సర్వీసుల్లో పోస్టులు ఇలా ఉన్నాయి. 

ఇండియన్ ఆడిట్ & అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ A – 20 పోస్టులు

ఇండియన్ సివిల్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ A – 25 పోస్టులు

ఇండియన్ డిఫెన్స్ అకౌంట్స్ సర్వీస్, గ్రూప్ A – 24 పోస్టులు

ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ A – 37 పోస్టులు

ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఆదాయపు పన్ను), గ్రూప్ A – 180 పోస్టులు

ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ (IRMS), గ్రూప్ A – 150 పోస్టులుఢిల్లీ, అండమాన్ నికోబార్ పోలీస్ సర్వీస్ (DANIPS), గ్రూప్ B – 79 పోస్టులు

మీ ఫలితాన్ని ఇలా చెక్ చేసుకోండి

ముందుగా UPSC upsc.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.

హోమ్‌పేజీలో ఇచ్చిన “UPSC సివిల్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్ 2024” లింక్‌పై క్లిక్ చేయండి.

ఇప్పుడు ఒక కొత్త PDF ఫైల్ ఓపెన్ అవుతుంది. అందులో రోల్ నంబర్ల జాబితా ఇచ్చి ఉంటారు. 

దానిలో మీ రోల్ నంబర్‌ను జాగ్రత్తగా చెక్ చేసుకోండి.

ఈ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.