MP Margani Bharat: మహానాడు అంటూ హడావుడి చేస్తున్న టీడీపీ లీడర్లు అనుమతులు లేకుండా ఇష్టం వచ్చిన చోట తవ్వకాలు చేస్తున్నారని ఫ్లెక్సీలు కడుతున్నారని ఆరోపించారు వైసీపీ ఎంపీ మార్గాని భరత్. అధికారులు అనుమతి ఇచ్చిన ప్రకారం కాకుండా జనాలు ఎక్కువ కనిపించేలా ఇరుకుగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారని విమర్శించారు. అందుకే అక్కడ తొక్కిసలాట జరిగినా, ఎవరికీ ఏమైనా అయినా పూర్తి బాధ్యత చంద్రబాబుదేనన్నారు భరత్. 


అలాంటి ప్రచారం పిచ్చితోనే రాజమండ్రి పుష్కరాల సమయంలో 29 మందిని పొట్ట బెట్టుకుంది టీడీపీ అధినేత చంద్రబాబే అంటూ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. పుష్కరాల సమయంలో జనాలందరినీ రాత్రి నుంచి అక్కడే ఉండి జమ చేసి డ్రోన్ షాట్లు, వీడియోలు తీసుకున్నారని చెప్పారు. ఆ తర్వాత వీళ్లు కుటుంబ సమేతంగా పూజలు జరిపించుకున్న తర్వాతే రాత్రి నుంచి అక్కడే ఉన్న వేలాది మంది ప్రజలను ఒక్కసారిగా వదలడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు.


పుస్కరాల తొక్కిసలాట ఘటనపై సోమయాజులు అనే ఓ కమిషన్ వేశారని అన్నారు. మీడియా, భక్తుల అత్యుత్సాహం వల్లే ఆ ప్రమాదం జరిగిందని ఆ కమిటీ తెలిపిందన్నారు. ప్రమాదానికి కారణం అయిన చంద్రబాబుకు, 29 మంది మృతికి ఎలాంటి సంబంధం లేదని చివరకు తేల్చి చెప్పడం దారుణం అని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఇంతకంటే దారుణం అయిన విషయం ఇంకేమైనా ఉంటుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చంద్రబాబు తప్పు చేసి ఉండకపోతే.. ఆరోజు అంటే తొక్కిసలాట జరిగిన రోజు సీసీటీపీ ఫుటేజీని విడుదల చేయాలని సవాల్ విసిరారు. 29 మంది మృతికి, 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలవడానికి కారణం చంద్రబాబే అంటూ చెప్పుకొచ్చారు. 



పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచాడు.. అందుకే జూనియర్ ఎన్టీఆర్ దూరం


చంద్రబాబుది ఎవరినైనా వాడుకుని వదిలేసే మనస్తత్వం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ను దేవుడు అంటూనే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో కూడా వాడి పేరు తీసేయాలంటూ ఎన్టీఆర్ గురించి చులకనగా మాట్లాడారని గుర్తు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైతే పార్టీ లేదు బొక్కా లేదంటూ చేసిన కామెంట్లను ప్రజలు ఇంకా మర్చిపోలేదని చెప్పారు.


పిల్లనిచ్చిన మామమే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పుడు శత జయంతి ఉత్సవాలు చేయడం ఏంటని అన్నారు. చంద్రబాబు బుద్ధిని ముందుగా గ్రహించే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబుకు దూరంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. మహనాడు పేరుతో రాజమండ్రి నగరాన్ని టీడీపీ నేతలు అస్తవ్యస్థం చేస్తున్నారని ఎంపీ భరత్ ఫైర్ అయ్యారు. మహానాడు జరిగేది రూరల్ మండలంలో అయితే టీడీపీ నేతలు సిటీలో హడావిడి చేస్తున్నారన్నారు.


మహానాడుకు అవసరమైతే తాము వాలంటరీ సేవలు అందిస్తామని ఎంపీ భరత్ చెప్పుకొచ్చారు. కార్యక్రమాన్ని ఎలాంటి అపశృతులు లేకుండా జరిపించాలని సూచనలు చేశారు. ఏదైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత చంద్రబాబే తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


దెందులూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మీడియా దుష్ప్రచారం చేస్తోందని.. తాను వాహనంలో ఉన్నానని నిరుపించడం కోసం శతవిధాల ప్రయత్నం చేశారన్నారు. ఆ వాహనం తన పేరు మీద లేదని.. అలాగే ఆ వాహనంలో కూడా తాను లేనని పేర్కొన్నారు. జగన్ అన్న ప్రభుత్వంలో విద్యా దీవెన, అమ్మవడి నూతన ఒరవడి సృష్టించిందని ఎంపీ మార్గాని భరత్ రామ్ తెలిపారు. గత ప్రభుత్వం కోట్లాది రూపాయిలు కాలేజీలకు బకాయి పెట్టిందన్నాురు. నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి సొమ్ము జమ చేస్తుంది వైసీపీ ప్రభుత్వమే అన్నారు.  ఇప్పటికే 14 వేల కోట్ల రూపాయలను ఫీ రీయంబర్స్ మెంట్ కింద చెల్లించినట్లు తెలిపారు. వైపీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లకో వందకు 98.4 శాతం హామీలను నెరవేర్చినట్లు వివరించారు. 


మహానాడు అంతా ఓ మోసం: మంత్రి వేణు


రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడు అంతా ఓ మోసం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. ఎన్టీఆర్ పేరును చంద్రబాబు చెరిపేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లాను సీఎం జగన్  ఏర్పాటు చేశారని వివరించారు. అందుకు మహానాడులో సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయండంటూ టీడీపీకి సూచించారు. పుష్కరాల్లో 29మంది మరణాలకు పశ్చాత్తాపం పడుతూ మహానాడులో తీర్మానం చేయాలన్నారు. అలాగే చంద్రబాబును నమ్ముకుని నాడు ఎన్టీఆర్ రాజకీయ జీవితం క్లోజ్ అయిందని ఆరోపించారు. నేడు చంద్రబాబు కారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం క్లోజ్ అయిందన్నారు. పవన్ సీఎం అవుతారని అనుకున్నవారు ఇప్పుడు నిరాశలో ఉన్నారని మంత్రి వేణు వివరించారు.