Jana Sena Plenary: పిఠాపురంలో జరుగున్న జనసేన ఆవిర్భావ సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతోంది. పిఠాపురంలో పవన్ విజయానికి కారణమని ఎవరైనా తామే కారణమని అనుకుంటే వాళ్ల ఖర్మ అంటూ కామెంట్స్ చేశారు. ఇది వర్మ గురించేనా అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
పిఠాపురంలో పని చేయాలని పవన్ కల్యాణ్ తమను పంపించినప్పుడు చాలా సంతోషించామన్నారు నాగబాబు. అసలు అక్కడ పవన్ విజయానికి తిరుగులేదని పిఠాపురం వెళ్లిన తర్వాత అర్థమైందని అన్నారు. అసలు పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి రెండే కారణాలు అని అన్నారు. మొదటి ఫ్యాక్టర్ పవన్ కల్యాణ్ అయితే.. రెండోది జనసైనికులను చెప్పుకొచ్చారు. ఇంతకు మించి ఎవరైనా ఈ విజయం తమదే అని అనుకుంటే మాత్రం వాళ్ల ఖర్మ అని అన్నారు.
పిఠాపురంలో వాస్తవంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు కేటాయించాల్సింది. కానీ పొత్తుల్లో భాగంగా పవన్ అక్కడి నుంచి పోటీ చేశారు. దీంతో టీడీపీ అధినాయకత్వం వర్మతో మాట్లాడి ఒప్పించి పవన్ కోసం ప్రచారం చేయించింది. పవన్ విజయంలో వర్మ పాత్ర కూడా చాలానే ఉందని ఆయన అనుచరులు చెబుతూ ఉంటారు. కానీ దీన్ని ఖండించేలా నాగబాబు చేసిన వ్యాఖ్యలు దుమార రేపుతున్నాయి.
జగన్‌పై కూడా నాగబాబు పంచ్‌లు జయకేతనం సభలో వైసీపీ అధినేత జగన్‌పై కూడా పంచ్‌లు వేశారు నాగబాబు. జగన్ మోహన్ రెడ్డి ఇంకా నిద్ర వీడలేదని అన్నారు. "వైసీపీ హాస్యగాళ్ల గురించి చెప్పుకోకుండా స్పీచ్‌ను ముగించలేం. జగన్‌లాంటి హాస్య నటుడు కనే కలలు గురించి చెప్పకుండా ఉండలేం. ఎన్నికల ముందు నుంచి నిద్రపోయి కలలు కంటున్నారు. ఇప్పటికీ ఆయన నిద్రవీడలేదు. కళ్లు మూసి తెరిచేలోపు 9 నెలలు అయిపోయాయని అంటున్నారు. అలా ఐదేళ్లు అయిపోతాయని చెబుతున్నారు. ఇలాంటి హాస్యం ఏ సినిమాలో కూడా ఉండదు. సార్ మీరు ఇలానే నిద్రపోండి... ఇరవై ఏళ్ల వరకు ఇలా నిద్రపోవాలని సలహా ఇస్తున్నాం. " అని నాగబాబు సెటైర్లు వేశారు.
అధికారంలో ఉన్నప్పు ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని చెబుతూనే ప్రత్యర్థులపై నైస్‌గా సెటైర్లు వేశారు నాగబాబు. "అధికారంలో లేనప్పుడు తీవ్రంగా మాట్లాడే శక్తి ఉంటుంది. ఇప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోకుండా మాట్లాడితే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అహాంకారం తలకెక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరిగిందో తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా మా అధినేత ఊరుకోరు. ఆయన లీడర్‌షిప్‌లో జాగ్రత్తాగ మాట్లాడతాం, పని చేస్తాం." అని అన్నారు.
పవన్ అంత ఎత్తుకు ఎదగలేకపోయిన ఆయన కోసం పని చేస్తా: నాగబాబు పవన్ లాంటి వ్యక్తి స్థాయికి మనం చేరుకోలేనప్పుడు కనీసం ఆయన కోసం పని చేస్తే కొంత మంచి చేసిన వాళ్లం అవుతామన్నారు. అదే తాను చేశానని నాగబాబు అన్నారు. "12 ఏళ్లు అంటే హిందూ సంప్రదాయంలో ప్రత్యేకత ఉంది. అందుకే 12వ ఆవిర్భావ సభ పుష్కరానికి ఉన్నంత పవిత్రమైన రోజుగా అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ చొరవతో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఎన్నో చోట్ల విజయం సాధించింది. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు చూస్తం. అలాంటి వ్యక్తి చేరుకునే స్థాయికి మనం వెళ్లలేకపోయినా కనీసం ఆయన అనుచరుడిగా ఉంటే మేలు జరుగుతుంది. అందుకే జనసైనికుడిగా ఎంతో గర్విస్తాను. " అని ప్రసంగాన్ని ముగించారు.