Mahasena Rajesh hot comments | టీడీపీ అధికార ప్రతినిధి.. మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్‌పై అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.. అధికార పార్టీలో ఉన్న తనపై తప్పుడు కేసులు పెట్టి తాను ఉన్న పార్టీను బదనాం చేస్తున్నారని రాజేష్ అన్నారు.
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో తప్పుడు కేసులు భరించానని, ఇప్పుడు మా ప్రభుత్వంలోనూ తనపై మహిళలను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడుతన్నారని ఆరోపించారు. ఈ కేసు గురించే అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీను కలిసి మాట్లాడినట్లు తెలిపారు. కొన్ని ఛానెల్స్, యూట్యూబ్ చానెల్స్‌లో టీడీపీ అధికార ప్రతినిధిపై కేసు నమోదు అంటూ ప్రచారం జరుగుతోందన్నారు. జనవరిలో జరిగింది అని చెబుతూ ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఏంటని ప్రశ్నించారు.. తనపై ఫిర్యాదు చేసినవారు వైసీపీ సానుభూతిపరులని, అయితే వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మానేసి ఇప్పుడు ఫిర్యాదు చేయడం ఇక్కడే తెలిసిపోతుందని ఇది పూర్తిగా ఫేక్ కంప్లైంట్ అని ఎస్పీకి తెలిపానని మహాసేన రాజేష్ చెప్పారు.
జగన్ 30 తప్పుడు కేసులు పెట్టారు
తనకు ఎటువంటి టెన్షన్ లేదని, తనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 30 తప్పుడు కేసులు పెట్టారని.. అప్పుడే టెన్షన్ పడలేదని, ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడతాను అన్నారు. అయితే తనపై కేసులు పెట్టి తన పార్టీని బద్నాం చేస్తున్నారని చెప్పారు. పార్టీని బ్యాడ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని, ఇదే తన బాధ అన్నారు. ఇటువంటి తప్పుడు కేసులు మరో 100 పెట్టినా భరిస్తానని, వైసీపీ ప్రభుత్వంలోనూ ఎన్నో తప్పుడు కేసులు భరించానని, అయితే తమ ఫ్రభుత్వం ఉన్నప్పుడు భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇది వైసీపీ ఫ్రభుత్వం కాదని, కూటమి ప్రభుత్వంలో అటువంటివి జరగవన్నారు. తనపై పెట్టిన తప్పుడు కేసుల్లో 15 ఇప్పటికే కోర్టు కొట్టివేసిందని, మిగిలిన తప్పుడు కేసులు ఆ దిశగానే ఉన్నాయని.. తనకు కోర్టులపై పూర్తి నమ్మకం ఉందన్నారు.
11కు పడిపోయినా వైసీపీకు బుద్ధి రాలేదు..
మహాసేన రాజేష్‌పై కేసు నమోదైందని, అదిగో అరెస్ట్ చేస్తున్నారు.. ఇదిగో అరెస్ట్ చేసేస్తున్నారని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ఇటువంటి తప్పుడు ప్రచారాల వల్లనే వైసీపీ 11 సీట్లుకు పరిమితమైందని, అయినా వారికి బుద్దిరాలేదన్నారు. ఇప్పటికైనా వైసీపీ వారికి మంచి బుద్ది ప్రసాదించాలని కోనసీమలో ఫేమస్ దేవుడు ఎవరున్నారో ఆయనను ప్రార్ధిస్తున్నానని రాజేష్ అన్నారు.
ఇంతకీ రాజేష్‌పై ఎందుకు కేసు ?
తన ఫోటోలు మార్ఫింగ్ చేసి మహాసేన రాజేష్, అతని అనుచరులు సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు చేస్తూ వేధిస్తున్నారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ నేతల నానీ భార్య శాంతి మలికిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మలికిపురం పోలీసులు మహాసేన రాజేష్‌తోపాటు అతని అనుచరులు పృద్వి, చక్రి, యల్లమెల్లి పండు, దేవ రామకృష్ణ, నేతల సునీల్‌లపై పలు సెక్షన్లుపై కేసు నమోదు చేశారు.
పోలీసుల అదుపులో శాంతి భర్త నేతల నాని..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుపై మలికిపురం మండలం శంకరగుప్తానికి చెందిన నేతల నానిని అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్‌గా ఉన్న నాని నేతల వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ నేతలతోపాటు మహాసేన రాజేష్‌పైనా అనేక వీడియోలులో వ్యాఖ్యలు చేశారు.. ఒకప్పుడు మహాసేన రాజేష్ టీమ్‌లోనే ఉన్న నాని నేతల ఆ తరువాత విడిపోయి వైసీపీలో సోషల్ మీడియాలో యాక్టివిస్ట్‌గా పనిచేస్తున్నారు.