తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తన తండ్రి చంద్రబాబును చూసేందుకు బయల్దేరిన లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తన తండ్రిని చూసేందుకు కూడా వెళ్లనీయ్యకపోవడం ఏంటనీ లోకేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు లేకుండా గంటసేపటి నుంచి అడ్డుకోవడం ఏంటని నిలదీశారు. నోటీసులు అడిగితే డిఎస్పీ వస్తున్నారు అని చెబుతున్నారు పోలీసులు. రోడ్డు మీద నుంచి క్యాంపు సైట్ లోకి రాకుండా అడ్డుకుంటున్న పోలీసులు. లోకేష్ వద్దకు మీడియా కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. వస్తే అరెస్టు చేయాలని ఆదేశిస్తున్నారు పోలీసులు. నా తండ్రిని చూడడానికి నేను వెళ్ళకూడదా అని పోలీసులను నిలదీసిన లోకేష్. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు పోలీసులు. లా అండ్ ఆర్డర్ ప్రోబ్లమ్ వస్తుందని చెప్పడంపై లోకేష్ మండిపడ్డారు.
చంద్రబాబును చూసేందుకు బయల్దేరిన లోకేష్- అడ్డుకున్న పోలీసులు- పాదయాత్ర సైట్‌లో ఉద్రిక్తత
ABP Desam
Updated at:
09 Sep 2023 08:49 AM (IST)
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. అరెస్టు చేసిన తన తండ్రిని చూసేందుకు వెళ్తుండగా అడ్డుకోవడంపై లోకేష్ మండిపడ్డారు.
చంద్రబాబును చూసేందుకు బయల్దేరిన లోకేష్- అడ్డుకున్న పోలీసులు- పాదయాత్ర సైట్‌లో ఉద్రిక్తత