Konaseema Crime News | ఉత్సవాలకు వినియోగిస్తున్న డీజేలు ప్రాణాలు తీస్తున్నాయి.. గతంలో డీజే సౌండ్‌ బాక్సుల ముందు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన సంఘటనలు చాలానే జరిగాయి. డీజే సౌండ్‌ బాక్సుల నుంచి వచ్చే పరిమితికి మించి గుండెలదిరేలా వచ్చే సౌండ్‌తో చిట్టి గుండెలు అకస్మాత్తుగా ఆగిపోతున్నాయి.. దసరా ఉత్సవంలో ఇదే తరహా సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.. 


కోనసీమ కేంద్రమైన అమలాపురంలో దసరా ఉత్సవం అనగానే వెంటనే గుర్తొచ్చేది చెడీతాలింఖానా. ఈ ప్రదర్శనలతో పాటు ఊరేగింపు కార్యక్రమాన్ని ఉత్సవంగా నిర్వహిస్తారు. విజయదశమి సందర్భంగా దసరా ముగింపు కార్యక్రమాలు శనివారం అమలాపురంలో అంగరంగ వైభవంగా జరిగాయి. అయితే ఈ ఊరేగింపుకోసం డీజే సౌండ్‌లను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. వీటికి పోలీసులు కూడా అనుమతులు ఇచ్చారు.


అమలాపురంలోని కొంకాపల్లికి చెందిన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు స్థానిక కనకదుర్గ అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. శనివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో డీజే సౌండ్‌ బాక్సుల ముందు యువకులు డ్యాన్స్‌లు చేస్తున్నారు. అంతా సంతోషంగా ఉత్సవాన్ని జరుపుకుంటున్న సమయంలో ఓ యువకుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటీన అమలాపురంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయువకుడు మృతిచెందినట్లు నిర్ధారించారు.


డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి మృతిచెందిన యువకుడిని పప్పుల వినయ్‌ (21)గా గుర్తించారు. అమలాపురం రూరల్‌ మండలం బండారులంక గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. దసరా ఉత్సవాల కోసం కొంకాపల్లికి వచ్చిన వినయ్‌ గుండెపోటుతో మృతిచెందడంతో విషాదం నెలకొంది.  డీజే సౌండ్‌ బాక్సులకు అత్యంత దగ్గరగా డ్యాన్స్‌లు చేయడం వల్ల గుండె లయ తప్పి కార్డియాక్‌ అరెస్ట్‌ అయినట్లు భావిస్తున్నారు.


గతంలో ఎన్నో సంఘటనలు..


డీజే సౌండ్‌ ప్రకంపనలకు గతంలో గుండె ఆగిపోయి మృతిచెందిన సంఘటనలు చాలానే ఉన్నాయి.. తెలంగాణాలోని వివాహం అనంతరం జరిగే వేడుకలో నూతన వరుడు డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు.. దీంతో పెళ్లింట తీవ్ర విషాదాన్ని నింపింది ఈ సంఘటన.. తెలుగు రాష్ట్రాల్లో పలు ఉత్సవాల్లో డీజే సౌండ్‌ బాక్సుల ముందు డ్యాన్స్‌లు చేస్తూ కుప్పకూలి మృతిచెందిన సంఘటనలు చాలా జరిగాయి.. గతేడాది అనంతపురం జిల్లా ధర్మవరంలో గణపతి మండపం ముందు డీజే బాదాడు.. తెలంగాణాలోని నిర్మల్‌ జిల్లాలో కూడా ఈతరహా సంఘటన చోటుచేసుకుక్సుల ముందు ఓ యువకుడు డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి గుండెపోటుతో మృతిచెంంది..  తాజాగా అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోకి వచ్చే అమలాపురంలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో విషాదాన్ని నింపింది..


పరిమితికి మంచి వచ్చే సౌండ్‌తో కార్డియాక్‌ అరెస్ట్‌లు..


ఉత్సవాల ఊరేగింపుల్లో డీజే సౌండ్‌ బాక్సులు పదుల సంఖ్యలో ఏర్పాటు చేసి ఆపై పరిమితికి మించిన సౌండ్‌ను వదులుతుండడం వల్లనే ఈతరహా కార్డియాక్‌ అరెస్ట్‌లు చోటుచేసుకుంటున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. డీజే సౌండ్‌ బాక్సులకు అత్యంత దగ్గరలో అంటే కేవలం ఒక మీటరు దూరంలోనే డ్యాన్స్‌లు చేయడంతో స్పీకర్లు నుంచే వచ్చే ధ్వనితో ఈ ప్రభావం చెవులు, గుండెపై పడుతుందని హెచ్చరిస్తున్నారు... ఈ డీజే సౌండ్‌ బాక్సు ముందు డ్యాన్స్‌లు చేసిన వారు రెండు రోజుల వరకు చిన్న చిన్న శబ్ధాలను వినే సామార్ధ్యాన్ని కోల్పోతారని, ఇది చాలా మందిని పరిశీలిస్తే గమనిస్తామంటున్నారు. సాధారణంగా మన చెవులు 70 డిజెబుల్స్‌ వరకు తట్టుకోగలవు.. కానీ డీజే సౌండ్‌ బాక్సుల నుంచి 100 నుంచి 130 డిసిబెల్స్‌ వరకు ధ్వనిని వ్యాప్తిచేస్తున్నాయని, దీనికి తోడు అత్యధిక బేసే ధ్వనిని విడుదల చేయడం, ఈ ధ్వని తరంగాలు గుండెకు అనుసంధానంగా ఉండే కర్ణికను ప్రేరేపిస్తుందని, దీనివల్ల గుండెపోటుకు దారితీస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు.. ధమనుల్లో అధిక రక్తపోటు, ఆర్టీఫీషియల్‌ హైపర్‌ టెన్షన్‌ పెరిగి గుండెపోటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వంటివి సంభవించే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.. 


హైదరాబాద్‌లో డీజే సౌండ్స్‌ నిషేధం


సౌండ్‌ పొల్యూషన్‌తో ప్రజలు ప్రాణాలకు ప్రమాదంగా మారిన డీజే సౌండ్‌లను హౖెెదరాబాద్‌లో పోలీసులు నిషేదం విధించారు. మతపరమైన కార్యక్రమాలు, ఊరేగింపుల్లో డీజే సౌండ్స్‌ వినియోగించకూడదని ఉత్సవ కమిటీలకు ఆదేశాలు జారీచేశారు.. దీనిపై హైదరాబాద్‌ సీపీ ఆనంద్‌ నోటిఫికేషన్‌ జారీ చేసి అమలు చేయాలని ఆదేశించారు. డీజేల కారణంగా వృద్ధులు, చిన్నారులు, హృదయ సంబంధిత రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీటిపై ఫిర్యాదులు పెరగంతో ఈనిర్ణయం తీసుకున్నామని వెల్లడిరచడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. అయితే కేవలం హైదరబాద్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అన్ని చోట్ల డీజే సౌండ్‌లను నిషేదించాలని ప్రజలు కోరుతున్నారు.