మ‌నం బైక్ పై కానీ, స్కూటీపైన కానీ వెళ్తుంటే అక‌స్మాత్తుగా హ్యాండిల్‌కు ఉన్న బ్రేక్ లివ‌ర్ గ్యాప్ లోనుంచి బొద్దింక కానీ లేదా ఏ ఇత‌ర ప్రాణి కానీ క‌నిపిస్తే కంగారు ప‌డ‌తాం.. వెంట‌నే బ్రేక్ వేసి బండిని అట్లానే వ‌దిలేస్తాం.. అయితే ఓ వ్య‌క్తికి మాత్రం అనుకోని అతిధి మాత్రం అక‌స్మాత్తుగా క‌నిపించి కంగారు పెట్టింది.. దీంతో తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురై అక‌స్మాత్తుగా బైక్ నుంచి దూకేయ‌డంతో స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట ప‌డ్డాడు.. ఇంత‌కీ ఆ వ్య‌క్తికి క‌నిపించిన దేంటి అనుకుంటున్నారా.. అయితే ఈస్టోరీ చదివేయండి..

Continues below advertisement

కొంత దూరం వెళ్లాక షాకిచ్చిన పాము..

గ్రామీణ ప్రాంతాల్లోకూడా ద్విచ‌క్ర‌వాహ‌నాల సంఖ్య బాగా పెరిగింది.. అందులోనూ మ‌హిళ‌లు, పెద్ద‌వారు నడిపేందుకు కాస్త కంఫ‌ర్ట్‌గా ఉండే వాహ‌నం ఏదైనా ఉందంటే అది స్కూటీనే అంటుంటారంతా.. అందుకే ఈమధ్య స్కూటీల వినియోగం బాగా పెరిగింది.. ఇక గ్రామాల్లో అయితే ఇంటి ఆరుబ‌య‌టో లేక పొలాల‌కు వెళ్లే రైతులు పొల‌ల వ‌ద్ద‌నే బండి పార్కింగ్ చేసి త‌మ ప‌నులు చూసుకుని తిరిగి అదే స్కూటీపై వెళ్తుంటారు.. స‌రిగ్గా అలాగే ఇంటి ఆరుబ‌య‌ట పార్కు చేసిన స్కూటీను వేసుకుని బ‌య‌లేరితే కొంత దూరం వెళ్లే స‌రికి ఓ తాచు పాము బ్రేక్ లివ‌ర్ మ‌ధ్య‌లో ఉన్న గ్యాప్ లోనుంచి త‌ల బ‌య‌ట‌కు చూస్తుండ‌డంతో కంగారు ప‌డి దూకేశాడు.. ఈసంఘ‌ట‌న అంబేడ్క‌ర్ కోన‌సీమ జిల్లాలో చోటుచేసుకుంది.. 

Continues below advertisement

స్కూటీలో దూరిన పాము.. దూకేసిన వ్య‌క్తి..

అమలాపురం పట్టణంకు చెందిన చంద్ర‌మౌళి అనే వ్య‌క్తి  త‌న ఇంటి నుంచి స్కూటీపై బుచ్చయ్య అగ్రహారం మీదుగా ప‌నిమీద బ‌య‌ట‌కు వెళ్తున్నాడు.. ఇంత‌లో ఒక అనూహ్య ఘటన జరిగింది. స్కూటీ బ్రేక్ వద్ద ఒక పాము తల బయటకు పెట్టి ఉండడం కనిపించడంతో భయంతో  భ‌య భ్రాంతుల‌కు గురైన చంద్ర‌మౌళి ఒక్కసారిగా బ్రేక్ వేసి బండిని అలాగే వ‌దిలేసి దూకేశాడు. ఈ క్రమంలో ఆయన కింద పడిపోయారు. కాసేపటికి తేరుకుని స్కూటీలో పాము దూరిందని నిర్ధారించుకున్న సదరు వాహన చోదకుడు అక్కడున్న వారికి అస‌లు విష‌యం చెప్పాడు.. దీంతో స్థానికులు ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ, స్కూటీ ముందు భాగాన్ని తీసి పాము పిల్లను చాకచక్యంగా బయటకు తీశారు. అనంతరం దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. 

ఈ జాగ్రత్తలు పాటించాలంటున్న స్నేక్‌క్యాచ‌ర్ వ‌ర్మ‌..

​పాములు వెచ్చని ప్రదేశాలను ఆశ్రయిస్తాయి కాబ‌ట్టి ముఖ్యంగా వర్షాకాలంలో బైకులు, కార్ల ఇంజిన్లలో దూరే అవకాశం ఉంది. కాబట్టి, బైకులను బయట ఉంచేటప్పుడు, లేదా ఎక్కువ కాలం వాడకుండా ఉన్నప్పుడు మ‌ళ్లీ బ‌య‌ట‌కు వేసుకెళ్లే ముందు ముఖ్యంగా  బైక్ స్టార్ట్ చేసే ముందు ఇంజిన్ భాగాన్ని, చక్రాల చుట్టూ జాగ్రత్తగా పరిశీలించండి. బాహ్యంగా ఏమీ క‌నిపించ‌క‌పోయినా లోప‌ల భాగాల్లో దాక్కునే అవ‌కాశం లేక‌పోలేదు.. అందుకే   ఇంజ‌న్ స్టార్ట్ చేసి ఎక్స్‌లేట‌ర్‌ బాగా రేజ్ చేయ‌డం వ‌ల్ల లోన ఆ వైబ్రేష‌న్‌కు లోన‌ దాక్కున్న పాములు కానీ విష పూరిత‌మైన జెర్రెలు, తేళ్లు, ఇత‌ర పురుగులు ఏమైనా ఉంటే కింద ప‌డిపోతాయి.. లేదా బ‌య‌ట‌కు వ‌స్తాయి.. లేక‌పోతే లోప‌లి భాగాల్లో ఏదైనా అసాధారణమైన కదలికలు ఉన్నాయేమో జాగ్ర‌త్త‌గా చూసుకోవాలంటున్నారు. ​

బైక్, స్కూటీ హారన్ ను మోగించ‌డం ద్వారా కూడా ఆ శబ్దానికి పాములు భయపడి బయటకు వ‌చ్చేస్తాయి.. ఒక వేళ మ‌న‌కు అక‌స్మాత్తుగా లోప‌లి భాగాల్లో పాము కానీ లేదా ఇత‌ర విష‌పురుగులున్నా కంగారు ప‌డ‌కుండా స‌డ‌న్ బ్రేక్ వేయ‌కుండా దానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ నిదానంగా బ్రేక్ వేసి బండి స్టాండ్‌వేయ‌డం కానీ, ఆ అవ‌కాశం లేక‌పోతే దేనికైనా ఆన్చి పెట్ట‌డం చేయాలి.  అన్నిటికంటే ముందు మ‌నం మ‌న వాహ‌నాల‌ను పార్కింగ్ చేసే ప్రాంతంలో ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవ‌డం, అక్క‌డ‌ చెత్తాచెదారం, పొదలు లేకుండా చూసుకోవాలి.. ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలతో బైక్‌లో దూరిన విష స‌ర్పాల‌నుంచి త‌ప్పించుకోగ‌ల‌మ‌ని స్పేక్ క్యాచ‌ర్ వ‌ర్మ చెబుతున్నాడు..