Konaseema Fire Accident: డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓఎన్‌జీసీలో అగ్ని ప్రమాదం జరగడంతో మంటలు వ్యాపిస్తున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.  కోనసీమ జిల్లాలోని తూర్పుపాలెం ఓఎన్‌జీసీ వద్ద గ్యాస్ లీకైంది. దాంతో పాటు క్రూడాయిల్ కూడా లీకైనట్లు సమాచారం. చుట్టుపక్కల మంటలు వ్యాప్తిచెందుతాయని ఆందోళన చెందుతున్నారు స్థానికులు. మంటల భయంతో స్థానికులు ఇళ్లను వదిలి దూరంగా వెళ్తున్నారు. గతంలోనూ ఓఎన్‌జీసీలో చిన్న ప్రమాదాలతో పాటు రోజులపాటు మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఓఎన్‌జీసీలో గ్యాస్ లీకేజీలో చుట్టుపక్కల ప్రాంతాలను దట్టమైన పొగ వ్యాపిస్తోంది. ఈ అగ్నిప్రమాదం మరింత పెద్దది అయితే పరిస్థితి ఏంటని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.