అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన పంటను పరిశీలించి ఆపై రైతులతో మాట్లాడి వారి బాధలు తెలుసుకున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాసేపట్లో రైతులతో నేరుగా మాట్లాడనున్నారు. రాజమండ్రిలోని ఏవీ అప్పారావు రోడ్డులో ఉన్న జనసేన ప్రాంతీయ పార్టీ కార్యాలయంలో నష్టపోయిన రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకోనున్నారు. దీనికోసం రైతులతో జనసేనాని మాట్లాడేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ నాయకులు.. మరికొంత సేపట్లో రైతులతో నేరుగా మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకుని రైతులకు న్యాయం జరిగేందుకు ప్రయత్నించనున్నారు. 






నష్టపోయిన ప్రతీ గింజకు పరిహారం ఇచ్చేవరకు పోరాడతాం.. 
అకాల వర్షాల వల్ల ఏపీలో అమితంగా వరి వేసిన రైతులు నష్టపోయారని, వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 4.36 లక్షల ఎకరాలు వరిసాగు ఉంటుంద, దీనిలో దిగుబడి 14 లక్షల మెట్రిక్‌ టన్నులు ధాన్యం ఉండగా కేవలం ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 2 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే అన్నారు. తాము దొంగతనం చేయడంలేదు, దోపిడీలు చేయడంలేదు, కాంట్రాక్టు, అవినీతి చేడయంలేదని కష్టపడి చేమటోడ్చి ప్రజలకు అన్నంపేట్టే వ్యవసాయం చేస్తుంటే మాకు గిట్టుబాటు రావడంలేదని వాపోయారన్నారు. ప్రభుత్వం ముందే ధాన్యం కొనుగోలుచేసి ఉంటే ఈ అకాల వర్షాలకు నష్టపోయే వాళ్లం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు.


వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు వస్తే తప్ప కొనుగోలు చేసే పరిస్థితిలో లేరన్నారు. కొనుగోలు చేసేందుకు సంచులు ఇవ్వని ప్రభుత్వం రాత్రికి రాత్రి కొనుగోల చేయడానికి వచ్చాయాన్నరు. రైతులు కంట కన్నీరు పెట్టకూడదని జనసేన కోరుకుంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, ఏపీలోని ప్రత్యేకంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రైతులకు ప్రతీ గింజకు నష్టపరిహారం వచ్చే వరకు మీ వెన్నంటే జనసేన పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు.  


రాత్రికి రాజమండ్రిలోనే బస చేసిన పవన్‌..
రాజమండ్రిలో పవన్‌ కళ్యాణ్‌ రాత్రికి బస చేసే షెడ్యూల్‌ ముందుగా లేకపోయినప్పటికీ రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్ట్యా గురువారం వారితో నేరుగా ముఖాముఖీగా మాట్లాడాలని జనసేనాని నిర్ణయించుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసి రాజమండ్రి పార్టీ కార్యాలయంలో నష్టపోయిన పలు ప్రాంతాలకు చెందిన రైతుల బాధలు నేరుగా తెలుసుకునే ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు. పవన్‌ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నాయకులకు ఆదేశించారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులు జనసేన అధ్యక్షుడు పవన్‌ తో ముఖాముఖిలో పాల్గొననున్నారు.