ABP  WhatsApp

Pawan Kalyan: మనం గెలిచి తీరుతున్నాం, ప్రభుత్వం స్థాపిస్తాం - పవన్ కల్యాణ్ ధీమా

ABP Desam Updated at: 21 Feb 2024 04:40 PM (IST)

Bhimavaram News: భీమవరం నియోజకవర్గ నాయకులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడారు.

భీమవరంలో పవన్ కల్యాణ్

NEXT PREV

Pawan Kalyan Comments: వచ్చే ఎన్నికల కోసం సీఎం జగన్ సిద్ధం అంటున్నారని.. తాము మాత్రం యుద్ధం అంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుందని.. అందుకు వారు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మనం గెలుస్తున్నామని.. గెలిచి తీరుతున్నామని ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. భీమవరం నియోజకవర్గ నాయకులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు.


కుటుంబాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్‌ అని.. మనుషులను విడగొట్టడం ఆయనలో ఉన్న విష సంస్కృతి అని అన్నారు. వివిధ కులాలు కొట్టుకు చావాలనేదే జగన్‌ నైజం అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి చాలా కష్టపడి రూ.వేల కోట్లు సంపాదించి పెడితే.. జగన్ తన చెల్లెలికి అన్యాయం చేశారని ఆరోపించారు. ఇద్దరు బిడ్డలకు వైఎస్ సమానంగా పంచి ఇస్తే.. అందులో చెల్లికి వాటా ఇవ్వలేదని అన్నారు. అది చాలా బాధ కలిగించే అంశం అని అన్నారు. వైఎస్ షర్మిలకు సాక్షి పేపర్‌, భారతి సిమెంట్‌లో వాటాలు ఇవ్వనే లేదని అన్నారు.


సొంత చెల్లెలికే అన్యాయం చేసిన వాడు.. మనకేం చేస్తారని ప్రశ్నించారు. తాను ఎవరినైనా నమ్మితే చిత్తశుద్ధితో పని చేస్తానని.. అందరితో కలిసి ఉమ్మడి లక్ష్యం సాధించాలని కోరుకుంటామని అన్నారు. డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం ఉన్నప్పుడే.. నిజమైన అభివృద్ధి ఉంటుందని అన్నారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకని.. అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలని సూచించారు. 



జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేవి ఈ రోజుల్లో కుదరవు. 2019 ఎన్నికల్లో నేను ఆ మాట అన్నట్లుగా చెబుతున్నారు. ఎన్నోసార్లు చెప్పాను నేను ఆ మాట అనలేదు. ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ఖర్చును రూ.45 లక్షలకు పెంచింది. డబ్బులు ఖర్చు చేయకుండా ఈ రోజుల్లో కుదరదు. ఎవరికి భోజనాలు పెట్టకుండా రాజకీయాలు చేసేద్దామంటే అవదు. నాకైతే అభిమానులు వస్తారు. నాయకులకు ఇంత ముందు చెప్పా. డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఓట్లు కొనడంపై మీ నిర్ణయం మీదే. అందరూ దానిపై వేల కోట్లు ఖర్చు పెట్టి.. సైలెంట్ గా ఉంటారు. కనీసం 2029 తర్వాతైనా డబ్బులతో ఓట్లు కొనలేని రాజకీయం రావాలి. అప్పుడు నిజమైన డెవలప్ మెంట్ జరుగుతుంది- పవన్ కల్యాణ్

Published at: 21 Feb 2024 04:35 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.