EX MLC Annam Satish: బాపట్ల జిల్లా కాపు కళ్యాణ మండపంలోని విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ అన్నెం సతీష్ ప్రభాకర్.. స్థానిక శాసన సభ్యుడు, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అరాచాకాలకు అంతు లేకుండా పోయిందని ఆరోపించారు. ఎమ్మెల్యే కోన రఘుపతితో పాటు అధికారులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తానున్నానంటూ ముందు వరుసలో ఉంటానని తెలిపారు. తుపాకీ గుళ్లకు కూడా భయపడనంటూ కామెంట్లు చేశారు.
దోచుకుంటున్నారు..!
నియోజకవర్గంలో ఎవరు ఇల్లు నిర్మించుకోవాలన్నా, రియల్ ఎస్టేట్ ప్లాట్లు వేయాలన్నా స్థానిక శాసనసభ్యుడి అనుమతితో జరుగతోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అనుమతులు కావాలంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని తెలిపారు. డిప్యూటీ స్పీకర్ ఆశీస్సులు తీసుకోక పోతే అధికారులు అనుమతులు లేవని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుమ్మారని దుయ్యబట్టారు. ఎలక్షన్ లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి వంద రూపాయల చొప్పున దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకమైనటువంటి పాలన బాపట్ల నియోజకవర్గంలో ప్రజలు చూస్తున్నారని తెలిపారు. త్వరలోనే సీఎం జగన్‌ను కలిసి బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అరాచక పరిస్థితులను వివరిస్తానని ఆయన తెలిపారు.
ఓ ఒక్క నాయకుడికీ పైసా కూడా ఇవ్వొద్దు..!
అలాగే బాపట్ల ప్రజలు చాలా సౌమ్యులు అని ఆయన తెలిపారు. ఏ ఒక్కరూ కోపానికి వచ్చి, గట్టిగా మాట్లడరంటూ కామెంట్ల చేశారు. అలాంటి వారిని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి బెదిరించడం దారుణం అన్నారు. తాను ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇకపై ఏ ఒక్క నాయకుడికి కూడా ఒక్క పైసా ఇవ్వొద్దని.. ఎవరైనా బెదిరిస్తే తాను అడ్డుగా నిలబడతానని అన్నం సతీష్ ప్రకటించారు. బాధితులు తనను సంప్రదిస్తే.. ఏసీబీని ఆశ్రయిద్దామన్నారు. అవసరమైతే ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఫిర్యాదు చేద్దామని వివరించారు.
గతంలో తెదేపా నేతలు కూడా దోచుకున్నారు..!
అలాగే గతంలో గుంటూరు జిల్లాలోని బాపట్లలో తెదేపా ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని అన్నం సతీష్ ప్రభాకర్ ఆరోపించారు. బీజేపీ కుల, ప్రాంతాలకు అతీతంగా కార్యకర్త స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఎవరైనా పోటీ చేసి పదవులు పొందవచ్చని తెలియజేశారు. అవినీతిపై వెంటనే విచారణ జరిపించాలని తాను చేస్తున్న ఆరోపణలు వాస్తవాలని త్వరలో ఆధారాలతో సహా నిరూపిస్తానని పేర్కొన్నారు.
Also Read : Adinarayana Reddy : వైసీపీని 151 స్థానాల నుంచి 15కే పరిమితం చేస్తాం- ఆదినారాయణ రెడ్డి