రాజమండ్రి: చంద్రబాబును జైల్లో పెడితే మీ దగ్గరకు వచ్చి సంఫీుభావం తెలిపానని, అయితే తనకు తగిన బహుమతి ఇచ్చారని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. మీకన్నా జగన్‌ ప్రభుత్వమే వెయ్యి రెట్లు బెటర్‌ అని, తనను ఎప్పుడూ ఇంత హింస పెట్టలేదన్నారు. ముఖ్యమంత్రి ప్రజల్లో ఉండాలని, ఫారిన్‌లో బర్త్‌డేలు చేసుకోవడం కాదంటూ విమర్శించారు.. బూబూ మీ బాబుకు చెప్పు అంటూ మంత్రి లోకేష్‌ను హెచ్చరించారు.


పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై అనుమానాలున్నాయని ముందునుంచీ తన వాదనలు వినిపిస్తున్న మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఇటీవల మరిన్ని మీడియా సమావేశాలతో పోలీసుల తీరుపై విమర్శలు గుప్తిస్తున్నారు.. ఇదిలా ఉంటే గామన్‌ బ్రిడ్జి సమీపంలో పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిచెందిన స్థలంలో కొవ్వొత్తులతో నివాళి అర్పించేందుకు క్రైస్తవ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.. అయితే దానికి తమ మద్దతును తెలియజేస్తూ హర్షకుమార్‌ అక్కడకు వెళ్లడంతో పోలీసులు మధ్య హర్షకుమార్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి హర్షకుమార్‌ను పోలీసులు బలవంతంగా పోలీస్‌ జీప్‌లో తీసుకెళ్లారు.. సుమారు 5 గంటల వరకు పోలీసులు తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని హర్షకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు..


ఇంకా ఆయన ఏమన్నారంటే...


ఒక మాజీ ఎంపీ అయినటువంటి తనను పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చాలా దారుణంగా వ్యవహరించిందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్నారు.. బ్రిటీష్‌ పాలనకన్నా దారుణంగా మారిందన్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిచెందిన స్థలంలోకి కొవ్వొత్తిలతో తరలి రావాలని తానెవరికి పిలుపునివ్వలేదని, ఎవరి కుటుంబ సభ్యులు వారు స్వచ్చందంగా ప్రవీణ్‌ పగడాల మృతిచెందిన స్థలం వద్దకు కొవ్వొత్తులు పట్టుకుని వచ్చారన్నారు. తాను కేవలం వారి కోసం టెంట్‌ వేయించేందుకు వెళ్లామన్నారు.. అక్కడ టెంట్‌ వేసుకుంటుంటే మా టెంట్‌ సామాన్లు అన్నీ పట్టుకెళ్లిపోయారని, మేము ధర్నాలు చేస్తామని అనలేదని, సెక్షన్‌ 30కు విరుద్ధంగా వ్రవర్తించలేదని తెలిపామని చెప్పారు. అయితే డీఎస్పీ వినలేదని, ఎవడ్నీ రానివ్వనని, ఏమీ చేయనివ్వనని చెప్పారన్నారు. అయితే మీరు ఆపుచేయండని చెప్పానని, ఆ తరువాత తనను బలవంతంగా అక్కడినుంచి పోలీసులు తీసుకెళ్లారన్నారు.ముందు రోజు రాత్రి 3.30 గంటలకు అంబేడ్కర్‌ విగ్రహానికి పోలీసులు బలవంతంగా కూల్చేసి వారికి భయబ్రాంతులకు గురిచేసి విగ్రహాన్ని పట్టుకెళ్లిపోయారన్నారు. దీనిపై స్థానిక సీఐతో మాట్లాడి అక్కడ గొడవ లేకుండా చక్కదిద్దానన్నారు. అక్కడికి ఇక వెళ్లలేదన్నారు..


అయిదు గంటల పాటు జీప్‌లో నరకం చూపారు..


పాస్టర్‌ ప్రవీణ్‌ మృత దేహం లభ్యమైన స్థలం వద్దకు వెళ్లినా కూడా కారు దిగలేదని, కారు దిగి ఉంటే పలు రకాల కేసులు పెడతారని, అయితే పోలీసులే తన కారు ఎక్కారన్నారు. తాను డ్రైవింగ్‌ సీట్‌లోకి వెళ్లానని, సుమారు 15 నిమిషాలు తనను కారులోంచి దించేందుకు చాలా ప్రయత్నాలు చేశారని తెలిపారు. పశువుకన్నా దారుణంగా తనను కారులోనుంచి లాగేందుకు ప్రయత్నించారని, అయితే 15 నిమిషాల తరువాత వారి ధాటికి ఎత్తుకుని వాళ్ల జీపులో కూర్చొబెట్టుకున్నారని, అప్పటికి 3.45 నిమిషాలు సమయంలో తనను జీపులో రాజానగరం తీసుకెళ్లారని, అక్కడి నుంచి మళ్లీ వేమగిరి వరకు, మళ్లీ వేమగిరి నుంచి రాజానగరం వైపుగా తీసుకెళ్లారని, మళ్లీ లాలా చెరువు తీసుకువచ్చి బమ్మూరు నుంచి తిప్పి దివాన్‌ చెరువు వద్దనున్న రోడ్డు దగ్గర ఆగారని, అయితే అక్కడ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంకు తీసుకెళ్లి అక్కడ దించారని తెలిపారు. అక్కడ రెండు గంటలు ఉంచారన్నారు. ఎస్పీ నో లేక ఐజీనో తెలియదు కాని తనకోసం నిమిషనిమిషానికి కాల్స్‌ చేశారన్నారు.. బ్రిటీష్‌ నాటి కాలంలో కూడా ఇంతటి హేరాష్‌మెంటు అనుభవించలేదని స్వయంగా పోలీసులే చెప్పుకున్నారన్నారు. మళ్లీ అక్కడి నుంచి మాఅబ్బాయి వచ్చాడన్నారు.. అయితే ఇలా చాలా సేపు తనను మానసికంగా వేధించారన్నారు..


ప్రజల్లో ఉండకుండా ఫారిన్‌లో సెలబ్రేషన్స్‌ .. 


చంద్రబాబు  ఫారిన్‌ కంట్రీలో బర్త్‌డే చేసుకుంటున్నావట కదా.. ఏందయ్యా నీ పాలన.. ఇదేనా నీ పాలన.. నిన్ను ప్రశ్నిస్తే ఇష్టానుసారంగా మమ్మల్ని చేస్తావా.. ఒక క్రిస్టియన్ ఫాదర్‌ను చంపించావు.. కేసును తారుమారుచేశాన్నారు.. ఇప్పటివరకు పోస్ట్‌మార్టం రిలీజ్‌ చేయలేదని, నీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా అని ప్రశ్నించారు.. సిగ్గులేకుండా ఫారిన్‌ వెళ్లి బర్త్‌డేలు చేసుకుంటున్నావు, సిగ్గుఉండాలన్నారు. ఫాదర్ చనిపోతే క్రిస్టియన్‌ పాస్టర్లకు ఏడు నెలలు తాయిలాలు ఇచ్చి చక్కబెడదామనుకుంటున్నావా అన్నారు.. ఒక్క పిలుపుతో వేలాది మంమది అక్కడకు వచ్చారని, అక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరూ హత్య అని నమ్ముతున్నారన్నారు. ఎస్పీలు, ఐజీలు సిగ్గుపడాలన్నారు. ప్రజాస్వామ్యం తల వంచుకోవాలన్నారు.