Pastor Praveen Kumar Death Mystery : ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? పాస్టర్ ప్రవీణ్‌కుమార్‌ కేసులో ఆరా తీస్తున్న పోలీసులు!

East Godavari Latest News: పాస్టర్ ప్రవీణ్‌ మృతి కేసులో ఆ 12 నిమిషాల్లో ఏం జరిగింది? ఇప్పుడు పోలీసులు డిగ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి దొరిగిన ఆధారాలతో కేసులో ముందుకెళ్తున్నారు.

Continues below advertisement

Pastor Praveen Kumar Death Mystery : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు కొంతమూరు వద్ద వద్ద పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ కుమార్ చనిపోయి కనిపించడం తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది. ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదమని అనుకున్నప్పటికీ పాస్టర్లు మాత్రం ఇది హత్యగా అనుమానిస్తున్నారు. అందుకే ఈ కేసు చాలా సీరియస్‌ అయింది. ప్రభుత్వం కూడా సమగ్ర విచారణకు ఆదేశించింది. 

Continues below advertisement

ప్రవీణ్‌ మృతిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్న పోలీసులు వివిధ కోణాల్లో కేసు విచారణ చేస్తున్నారు. అర్థరాత్రి వేల చనిపోయినట్టు గుర్తించిన పోలీసుుల ఆ టైంలో ఏం జరిగిందో తెలుసుకుంటున్నారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ నేతృత్వంలో ఇద్దరు సీఐలు, ఎస్సైలతో కూడిన టీం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో కీలకమైన ఆధారాలు సేకరించారు. ఇంకా ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే పోలీసులకు అందివ్వాలని విజ్ఞప్తి చేశారు. 

కొవ్వూరు టోల్‌ గేట్‌ సమీపంలో ప్రవీణ్‌ టూవీలర్‌పై వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ లభించింది. వాటి ఆధారంగా కేసును ఎనలైజ్ చేసిన పోలీసులు రాత్రి సోమవారం రాత్రి 11.43 గంటలకు ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. టోల్‌ గేట్‌ నుంచి 11.31 నిమిషాలకు బయల్దేరిన తర్వాత ప్రమాదం జరిగిన 11. 43 నిమిషాల మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు కేసులో కీలకం. 

ఈ టోల్‌గేట్‌ను దాటుకొని ప్రవీణ్‌ వెళ్లిన వాహనంతోపాటు మరికొన్ని వాహనాలు అదే టైంలో అటుగా వెళ్లాయి. ఐదు వాహనాల్లో ఓ రెడ్ కలర్ కారు కూడా ఉంది. అది ప్రవీణ్ టూతోపాటే ముందుకు మూవ్ అయింది. ఇప్పుడు పోలీసులు ఆ కారుపై కూడా ఫోకస్ పెట్టారు. ఆ కారులో ఎవరు ప్రయాణించారు. మిగతా వాహనాలపై కూడా దృష్టి పెట్టారు. 

ప్రవీణ్‌ కుమార్‌ ఫోన్‌ కాల్‌డేటాను కూడా పోలీసులు ఎనాలసిస్ చేస్తున్నారు. ఆఖరి కాల్‌ రామ్మోహన్‌ ఆర్‌జేవైకి వెళ్లిందని పోలీసులు చెప్పారు. డెడ్‌బాడీ గురించి తెలిసిన తర్వాత ఆఖరి ఫోన్‌కాల్ చేసిన వ్యక్తికే ఫోన్ చేసి రప్పించారు. రామ్మోహన్‌ అతని భార్య వచ్చారు. వచ్చిన తర్వాత డెడ్‌బాడీ ప్రవీణ‌్‌కుమార్‌ది అని అన్నారు. విషయాన్ని కుటుంబ సభ్యలకు చేరవేశారు. 

హైదరాబాద్‌కు చెందిన పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలుగు రాష్ట్రాల్లోనే పెను సంచలనంగా మారింది. హైదరాబాద్‌ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులు అనుమాస్పద మృతిగా కేసు పెట్టారు. ఓవైపు కుటుంబ సభ్యులు, మరోవైపు పాస్టర్ల డిమాండ్‌తో ఈ కేసులో సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోస్టుమార్టం కూడా పూర్తి చేశారు. ప్రస్తుతానికి పోలీసులు విచారిస్తున్నప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటివ్‌ మేజిజస్ట్రేట్‌తో దర్యాప్తు చేయనున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. 

మృతదేహం తీసుకెళ్లకుండానే పాస్టర్లు ఆందోళన చేపట్టారు. దీనిపై చాలా అనుమానాలు ఉన్నాయని ప్రభుత్వం, అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రావాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వారిని, కుటుంబ సభ్యులను ఒప్పించి డెడ్‌బాడీని హైదరాబాద్‌కు తరలించారు. డెడ్‌బాడీని రేపు ఆయన అభిమానుల కోసం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద ఉంచనున్నారు. 

ప్రవీణ్ మరణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కచ్చితంగా ఇది హత్య అయితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

Continues below advertisement