Dindi Chinchinada Bridge | కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే వశిష్ట నదీపాయపై నిర్మించిన దిండి - చించినాడ బ్రిడ్జిపై ఈనెల 18, 21 తేదీల్లో మొత్తానికి రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు బైక్‌లు, కార్లు వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన అధికారులు బ్రిడ్జీ బేరింగ్‌లు రీప్లేస్‌మెంట్ చేస్తున్న క్రమంలో ఆ రెండు రోజులు ఏ వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేదని చెబుతున్నారు. దీంతో ఈ బ్రిడ్జిపై రెండు రోజుల పాటు మొత్తానికి రాకపోకలు బంద్ చేయనున్నారు..
2001లో ప్రారంభమైన వంతెన సేవలు వశిష్ట నదీపాయపై దిండి - చించినాడ ప్రాంతాలను కలుపూతూ 216 జాతీయ రహదారికి అనుసంధానించేలా అప్పటి దివంగత లోక్ సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి చొరవతో నిధులు సమకూరి 1995 లో నిర్మాణం మొదలు పెట్టిన ఈవంతెన నిర్మాణం పూర్తిచేసి 2001లో ప్రారంభించారు. దాదాపు 25 ఏళ్ల కాలం పూర్తయిన ఈ వంతెనకు అత్యవసర మరమ్తత్తులు చేపట్టాల్సిన పరిస్థతుల నేపథ్యంలో మరమ్మత్తుల నిమిత్తం ఈ వంతెనపై రాకపోకలు పూర్తిగా తాత్కాలికంగా నిలుపుదల చేశారు. 216 జాతీయ రహదారిలో కీలక బ్రిడ్జిగా ఉన్న ఈ వంతెన పై వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేదించిన క్రమంలో అంబేడ్కర్ కోనసీమ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, పాలకొల్లు, భీమవరం ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోనుండగా వంతెన మరమ్మత్తులు పూర్తయ్యే దాకా ఆర్టీసీ బస్సులు, ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలు అన్నీ రావులపాలెం మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే వంతెన మరమ్మత్తులు జరుగుతున్నా కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాలకు ఇలా లైట్ మోటారు వెహకల్స్‌కు రాకపోకలు సాగించేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో కాస్త ఉపశమనం కలిగినట్లయ్యింది.. అయితే రెండు రోజులుపాటు మొత్తానికి ఏ వాహనాలకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో హెవీ వెహికల్స్‌తోపాటు లైట్ మోటారు వెహికల్స్‌లో ఇటువైపుగా ప్రయాణాలు చేసేవారు కాస్త ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి తలెత్తనుంది.. రెండు రోజుల పాటు మొత్తానికి మూసివేతకు కారణం ఇదే.. దిండి- చించినాడ వంతెన సుధీర్ఘకాలంగా సేవలందిస్తోండగా ఈ వంతెనకు అత్యవసర మరమ్మత్తులు నిర్వర్తించాలని ఇటీవలే తనఖిలు చేసిన నిపుణుల బృందం హెచ్చరించింది.. దీంతో అప్పమత్తమైన అధికార యంత్రాంగం వెంటనే మరమ్మత్తులకు ఆదేశించింది.. దీంతో ఈ వంతెన మరమ్మత్తు పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు.. ఇప్పటికే మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్న సాంకేతిక సిబ్బంది వంతెన బేరింగ్ రీప్లేస్‌మెంట్ చేయాల్సి ఉందని తెలిపింది.. దీనికోసం రెండు రోజుల పాటు వంతెనపై పూర్తిగా వాహనాల రాకపోకలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌ను మరమ్మత్తు నిర్వహణ సంస్థ కోరింది.. దీంతో బేరింగ్ రీప్లేస్‌మెంట్ మరమ్మత్తు పనుల నిమిత్తం పనుల చించినాడ వంతెన వద్ద ట్రాఫిక్ ఈనెల 18, 21 తేదీ లలో రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు పూర్తిగా ట్రాఫిక్కు ను నిలుపుదల చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
జాతీయ రహదారి ఆధారిటీ అధి కారులు మరియు రోడ్డు కాంట్రాక్టర్ బేరింగ్‌ల కొలతలు మరియు స్లీవ్ స్థానాల ధృవీకరణ కోసం స్పాన్‌లను ఎత్తివేయాలని ప్రతిపాదించారని ఆ దిశగా ఈనెల 18, 21 తేదీలలో రెండు రోజుల పాటు పూర్తి ట్రాఫిక్ నిలు పుదల కోసం అభ్యర్థించారన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నిలు పుదల సమయంలో వాహనాల రాకపోకలను సజావుగా మళ్లించడం మరియు నిర్వహించడం కోసం సంబంధిత విభా గాలు, వాహన దారులకు అవసరమైన సూచనలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ యొక్క ట్రాఫిక్కు పూర్తి స్థాయి నిలుపుదల కొరకు సంబంధిత విభాగాలు పూర్తి సమన్వయం వహిం చాలని వాహనదారులు కూడా అధికారులకు పూర్తి గా సహకరించాలని ఈ ప్రకటన ద్వారా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.. వాహనాల దారి మళ్లింపు ఇలా.. హెవీ మోటార్ వెహికల్స్ కోసం కత్తిపూడి నుంచి నర్సాపురం/ భీమవరం వైపు ప్రయాణించే వారుకత్తిపూడి- జగ్గంపేట రాజమహేంద్రవరంపాలకొల్లు నర్సాపురం / భీమవరం వెళ్లాల్సి ఉంది.. కాకినాడ నుంచి నర్సాపురం/ భీమవరం వైపు వెళ్లేవారు రావు లపాలెం సిద్ధాంతం మీదుగా వెళ్లాలి.. కాకినాడ,రామచంద్రాపురం మండపేట నుండి వెళ్లేవారు రావులపాలెం సిద్ధాంతం మీదుగా పాలకొల్లు నర్సాపురం / భీమవరం చేరుకోవాల్సి ఉంది. అమలాపురం నుంచి నర్సాపురం / భీమవరం వైపు వెళ్లేవారు అమలా పురం - కొత్తపేట, రావుల పాలెం సిద్ధాంతం మీదుగా పాలకొల్లు నరసాపురం భీమవరం చేరుకోవాల్సి ఉంది.. తాటిపాక/రాజోలు నుంచి నర్సాపురం/ భీమవరం వైపు వెళ్లేవారు తాటిపాకపి.గన్నవరం ఈతకోట, సిద్ధాంతం మీదుగా పాలకొల్లు నరసాపురం భీమవరం చేరుకోవాలి. యానాం నుండి బయ లుదేరే వారు ద్రాక్షారామ రావులపాలెం, సిద్దాంతం మీదుగా పాలకొల్లు, నరసాపురం భీమవరం చేరుకోవాలి. నరసాపురం నుంచి రాజోలు వైపు వెళ్లేవారు భీమవరం పాలకొల్లు సిద్ధాంతం రావులపాలెం మీదుగా రాజోలు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నరసాపురం నుండి రాజోలు బయలుదేరే వారు దిగమర్రు పాలకొల్లు సిద్ధాంతం రావులపాలెం మీదుగా రాజోలు చేరుకోవాల్సి ఉంది.