Borugadda Anil Kumar: హైకోర్టు సీరియస్, రాజమండ్రి జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్ కుమార్

Andhra Pradesh News | మద్యంతర బెయిల్ గడువు ముగియడంతో గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైలులో లొంగిపోయారు. హైకోర్టు ఉత్తర్వులతో ఆయన లొంగిపోయాడని తెలుస్తోంది.

Continues below advertisement

రాజమహేంద్రవరం: వైసీపీ సానుభూతిపరుడు, గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ (Borugadda Anil Kumar) వ్యవహారం కొలిక్కి వచ్చింది. మద్యంతర బెయిల్ గడువు మంగళవారం (మార్చి 11న) సాయంత్రం ముగియగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు (Rajamahendravaram Central Jail)లో బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు. మద్యంతర బెయిల్ పొందేందుకు ఫేక్ సర్టిఫికెట్ పెట్టారన్న ఆరోపణలు రావడంతో బోరుగడ్డ లొంగిపోతాడా లేదా అని రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో హైకోర్టు సీరియస్ అయింది. గడువులోగా లొంగిపోవాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంటక జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో బోరుగడ్డ మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత జైలు అధికారుల వద్ద లొంగిపోయాడు. 

Continues below advertisement

వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్ లపై దుర్భాషలాడడం, చంపేస్తానంటూ వ్యాఖ్యలు చేసిన కేసులో బోరుగడ్డ అనిల్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. బోరుగడ్డపై రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కాగా విచారణ కొనసాగుతోంది. కొన్ని కేసుల్లో బెయిల్ రాగా, అనంతపురం నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ అయిన బోరుగడ్డ అనిల్ కుమార్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నాడు.

ఫేక్ సర్టిఫికెట్స్ ఆరోపణలు

అయితే తన తల్లికి అనారోగ్యంగా ఉందనీ, ఆమెకు చూపిస్తే చేయించాలని కోరుతూ హైకోర్టు నుంచి బోరుగడ్డ మద్యంతర బెయిల్ పొందాడు. ఫేక్ మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి అటు కోర్టును, ఇటు పోలీసులను వేరే కొట్టించాడని ఆరోపణలు వచ్చాయి. గుంటూరు డాక్టర్ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారంటూ బోరుగడ్డ అనిల్ కుమార్ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ పై దుమారం రేగింది. రేపు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి బోరుగడ్డ మధ్యంతర బెయిల్ పొడిగించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

తల్లికి అనారోగ్యంతో మద్యంతర బెయిల్!
తన తల్లి పద్మావతికి గుండె జబ్బు, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతోందని బోరుగడ్డ హైకోర్టుకు తెలిపారు. కుమారుడ్ని తాను ఒక్కడినేనని, తల్లికి చికిత్స కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని ఫిబ్రవరి 14న పిటిషన్ వేశాడు. తల్లి అనారోగ్యంపై మెడికల్ సర్టిఫికెట్ సబ్మిట్ చేశాడు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే శ్రీనివాస్ రెడ్డి బోరుగడ్డకు ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు మద్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఫిబ్రవరి 28న బోరుగడ్డ జైలు సూపరిండెంట్ వద్ద లొంగిపోయాడు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స చేపించానని, కానీ తల్లిని చూసుకునేందుకు తాను ఒక్కడినే ఉన్నానని కోరగా.. హైకోర్టు మార్చి 11 వరకు మద్యంతర బెయిల్ పొడిగించింది. మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా రాజమహేంద్రవరం జైలులో లొంగిపోయాలని ఉత్తర్వులలో పేర్కొంది.

బోరుగడ్డ అనిల్ కుమార్ ఫేక్ మెడికల్ సర్టిఫికెట్స్ సబ్మిట్ చేసి బెయిల్ తీసుకుని పరారయ్యాడని ప్రచారం జరిగింది. దర్యాప్తు చేపట్టిన గుంటూరు పోలీసులు డాక్టర్ ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్ ఇవ్వలేదని చెప్పారు. అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే ఇటీవల బోరుగడ్డ ఓ వీడియో విడుదల చేశారు. తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని, ఆమెను చూసుకోవడానికే మధ్యంతర బెయిల్ తీసుకున్నానని తెలిపారు. ఎక్కడికి పారిపోలేదని, తప్పుడు పత్రాలు కూడా సబ్మిట్ చేయలేదన్నాడు. కోర్టు తీర్పును తాను ధిక్కరించబోనని, గౌరవిస్తానని చెప్పాడు. తనకుగానీ, తల్లి, చెల్లెళ్లు, వారి కుటుంబాలకు ఏమైనా జరిగితే నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబుదే పూర్తి బాధ్యత అని బోరుగడ్డ అనిల్ కుమార్ తన వీడియోలో పదే పదే పేర్కొన్నాడు. 

Continues below advertisement