Konaseema Punya Kshetra Darshini: పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే అందుకు తగిన పరిస్థితులు ఒక్కోసారి సమకూరవు. ఆధ్యాత్మికతకు, ప్రకృతి రమణీయతకు కేంద్రంగా ఉండే కోనసీమలో అత్యంత తక్కువ ఖర్చుతో టెంపుల్స్‌ను చుట్టేసే అవకాశాన్ని ఏపీఎస్ ఆర్టీసీ కల్పిస్తోంది. సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ ప్యాకేజీతో కోనసీమలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను చూసేయవచ్చు..
కోనసీమలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు..
ఆధ్యాత్మికతకు నెలవైన కోనసీమలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నాయి.. ఇందులో ప్రాముఖ్యంగా అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, వాడపల్లి వెంకటేశ్వరస్వామి, ర్యాలీలో జగన్మోహిని, కేశవస్వామి ఆలయం, అయినవిల్లి వరసిద్ధి వినాయక ఆలయం ఇలా చాలా ప్రసిద్ధ ఆలయాలు ఉన్నాయి. వీటిని సందర్శించుకోవడానికి కోనసీమ పుణ్యక్షేత్ర దర్శిని పేరుతో ఏపీఎస్ ఆర్టీసీ ఒక ప్యాకేజీ రూపకల్పన చేసి అమలు చేస్తోంది. రాబోయేరోజుల్లో ఈ ప్యాకేజ్‌లో మరిన్ని ఆలయాలు జోడిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
టెంపుల్ టూర్ ప్యాకేజీ ఇలా ఉంటుంది
అంబేద్కర్ కోనసీమ జిల్లా పుణ్యక్షేత్ర దర్శిని టూరిజం కింద ఈనెల 28 నుంచి ప్రారంభమైన ఈ టూర్ ప్యాకేజ్‌లో ప్రతీ ఆదివారం బస్సు సర్వీస్ ఉంటుంది. ప్రతీ ఆదివారం రావులపాలెం ఆర్టీసీ (RTC)డిపో నుంచి ప్రారంభమయ్యే సాయంత్రానికి మళ్లీ డిపోకు చేరుకుంటుంది. ఈ ప్యాకేజ్ స్కీమ్ కింద నిర్వహించే పర్యటన ద్వారా భక్తులు, పర్యాటకులు జిల్లాలోని ఎనిమిది ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం లభిస్తుంది.
ప్రతి ఆదివారం ఉదయం 6:00 గంటలకు రావులపాలెం, వాడపల్లి నుంచి ఆల్ట్రా-డీలక్స్ బస్సులు బయలుదేరుతాయి. బస్సు టిక్కెట్టు ధర ఒక్కొక్కరికి రూ.460 నిర్ణయించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ పుణ్యక్షేత్ర దర్శిని కార్యక్రమం కోనసీమ జిల్లా ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంపదను భక్తులు, పర్యాటకులకు చేరవేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
పర్యటనలో కవర్ అయ్యే పుణ్యక్షేత్రాలు ఇదే..
1. వాడపల్లి – శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం2. ర్యాలీ – శ్రీ జగన్మోహన కేశవ స్వామి క్షేత్రం దర్శనం3. కుండలేశ్వరం – శ్రీ కుండలేశ్వర స్వామి దర్శనం4. మురమళ్ళ – శ్రీ వీరేశ్వర స్వామి పుణ్యక్షేత్రం5. ముక్తేశ్వరం – శ్రీ క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయ దర్శనం6. అయినవిల్లి – వినాయకుడు (స్వయంభూ) పుణ్యక్షేత్రం7. వానపల్లి – శ్రీ పల్లాలమ్మ తల్లి ఆలయ దర్శనం8. పలివెల – శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి దర్శనం
పర్యాటకులు సాయంత్రం 6:00 గంటలకు రావులపాలెం తిరిగి వచ్చేస్తారు. బస్సు టికెట్ ధర: ఈ పర్యటనకు ఒక్కొ వ్యక్తికి ₹460/- మాత్రమే వసూల చేస్తున్నారు.
సంప్రదించాల్సిన ఫోన్లు:
రావులపాలెం డిపో ఎంక్వైరీ: 99592 25549ఆర్.ఎస్. రావు: 73829 12398టి.చి.వి.బి.: 73829 12400