Pawan Kalyan Varahi Ammavari Deeksha | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. జూన్ 26వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వారాహి అమ్మవారి దీక్షలో భాగంగా జనసేనాని 11 రోజులపాటు దీక్ష చేస్తారు. దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ పాలు, పండ్లు, ద్రవాహారం తీసుకుంటారని తెలుస్తోంది. గత ఏడాది జూన్ నెలలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టారు. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించిన సందర్భంగా పవన్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టారు.
Pawan Kalyan: వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, 11 రోజులపాటు దీక్ష
Shankar Dukanam
Updated at:
24 Jun 2024 09:53 PM (IST)
Andhra Pradesh News | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో వారాహి అమ్మవారి దీక్ష చేపట్టనున్నారు. గత ఏడాది పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్