yanam flower show: 
రెండెడ్ల బండిని తోలుతున్న రైతు.. గుర్రపు బండిపై స్వారీ చేస్తున్న జమిందారు.. ముచ్చటగా రెక్కలు విచ్చుకుని చూస్తోన్న డాల్ఫిన్‌లు.. ఇవన్నీ సహజ సిద్ధంగా పూచిన పూలతో తీర్చిదిద్దిన కళాకృతులు.. ఇవే కాదు.. దేశ విదేశాలనుంచి తెచ్చి అందంగా అలంకరించిన పువ్వులు.. విభిన్న రకాల జాతులకు చెందిన పండ్లు ఇలా అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి.. వీటికి తోడు పుష్ప సినిమాలో వినియోగించిన ఎర్ర చందనం దుంగలను మోస్తున్నట్లుగా రెండెడ్ల బండి సోయగం. మాతృప్రేమకు అద్దంపట్టేలా సహజ సిద్ధంగా ఏర్పాటు చేసిన ఆవు దూడ ప్రతిరూపం.. ఇక ఐ లవ్‌ యూ యానాం అంటూ గులాబీలతో అలంకరించిన లోగో ఇలా అన్నింటా ఆకట్టుకున్నాయి.
 
ఇక మీకిప్పటికే అర్ధం అయ్యి ఉంటుందిగా... అదేనండి.. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు ఆనుకుని ఉండే పుదుచ్చేరి యానాంలో ఈప్రత్యేక ఆకర్షనలు మూడు రోజుల పాటు కనువిందు చేశాయి... తెలుగువారి పెద్ద పండుగ అయినటువంటి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యానాంలో 21వ ప్రజాఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.. పుదుచ్చేరి ప్రభుత్వ ఢల్లీి అధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సారధ్యంలో జరిగిన ఈకార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగసామి, లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కైలాష్‌ నాధన్‌ హాజరయ్యారు. 
 
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా 23వ ఫ్లవర్‌ అండ్‌ ఫ్రూట్‌ షో మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యానాం ప్రజలే కాకుండా అంబేడ్కర్‌ కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాలనుంచి కూడా భారీ స్థాయిలో ప్రజలు తరలివచ్చారు. వీటతోపాటు దేశ విదేశాలనుంచి కళాకారులను రప్పించి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు భారీ ఎత్తులో నిర్వహించారు. సంస్కృతి, సాంప్రదాయాలు ప్రజలకు గుర్తుచేసేందుకు యానాంలో ప్రజా ఉత్సవాలు భారీగా నిర్వహిస్తున్నట్లు పుదుచ్చేరి ఢల్లీి అధికార ప్రతినిధి మల్లాడి కృష్షారావుతెలిపారు. యానాంను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు పుదుచ్చేరి ప్రభుత్వం కృషిచేస్తోందని తెలిపారు.