MP Bharat Fires On Raghurama : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీ ఎంపీ ఎంపీ భరత్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎంపీ రఘురామకృష్ణరాజుపై మరోసారి విరుచుకుపడ్డారు రాజమండ్రి ఎంపీ భరత్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పండు కోతిలా ఉండే రఘురామకృష్ణరాజు నన్ను నల్లోడా అంటూ  అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. నల్ల వారందరూ నీకు ఓటు వేయలేదా? అని ప్రశ్నించారు. పండు కోతిలా విగ్గు పెట్టుకుని మీడియా ముందు వచ్చి చిందులు తొక్కుతున్నావని తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు ఎంపీ భరత్.  విగ్గు తర్వాత పెట్టుకుందువు గానీ ముందు నువ్వు మగాడివా ఆడదానివా అన్నది తేల్చుకో, ముందు నీకు గైనికో మాస్తియా ఆపరేషన్ అవసరమని విమర్శించారు.  నాలుగు పెగ్గులు వేసుకుని ఏసీ రూమ్ లో కూర్చుని వాగుతున్నావని మండిపడ్డారు. రంగు గురించి పదే పదే మాట్లాడుతున్నావుగా ముందు రంగు కాదు గానీ నువ్వు మగాడివా ఆడదానివి అన్నది తేల్చుకో అంటూ రెచ్చిపోరారు. 


"రాజమండ్రి నుంచి ఎంపీగా జనసేన నుంచి లేదా టీడీపీ నుంచో పోటీచేస్తావంటగా.. రా..  నీకు దమ్ము ధైర్యం ఉంటే రా నేనే నిల్చుని ఎన్ని లక్షల మెజార్టీతో గెలుస్తానో చూద్దువు గాని. ఆవ భూముల గురించి నాపై విమర్శలు చేస్తున్నావు. నేను  అవినీతికి పాల్పడ్డానని చూపించు. నీకులా బ్యాంకులకు టోపీలు పెట్టి ప్రజల సొమ్ము కొట్టేయలేదు. నేను పుట్టుకతోనే  శ్రీమంతుడిని. నీకులా బ్యాంకులకు టోపీలు పెట్టే రకం కాదు. నీకులా తాగుబోతుని కాదు.. 24  గంటలు పనిచేస్తా.. సిగ్గు గాడివి, పెగ్గు గాడివి, అరిటాకు గాడివి." - ఎంపీ భరత్ 


"ఈ అరిటాకు మళ్లీ నాపై విమర్శలు చేశారు. నేను నల్లోడినే. నల్లగా ఉన్నవాళ్లు ఓట్లు వేయలేదా? నీకు అంటే నల్లగా ఉండే వాళ్లను అవహేళన చేస్తున్నారా?. పగోడు అయినా నన్ను శ్రీకృష్ణుడితో పోల్చాడు. అది చాలు నాకు. గైనిక్ ఆపరేషన్ చేయించుకో ముందు. మగాడివో ఆడదానివో ముందు తెలుసుకో. విగ్గు తర్వాత పెట్టుకుందువు. నేను ఎండలో తిరుగుతాను కాబట్టి సన్ స్క్రీన్ రాసుకుంటాను. నువ్వు కూడా ఎండలోకి వస్తే నీకు తెలుస్తుంది. నువ్వు ఇంట్లో కూర్చొని నాలుగు పెగ్గువు వేసి మీడియా ముందుకు వస్తావు. వొళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పేటీఎం గ్యాంగ్ తో నాపై విమర్శలు చేయిస్తున్నావు. నీకే దమ్ము ధైర్యం ఉంటే రా వచ్చి రాజమండ్రిలో పోటీ చేయ్. నేనే నిలబడతా. నర్సాపురంలో ఎంపీ అయ్యావు, ఎన్నిసార్లు నర్సాపురం వెళ్లావు. ఆవ భూముల్లో అవినీతి చేశానని ఆరోపిస్తున్నావు. ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నాను."- ఎంపీ భరత్ 


ఎంపీ రఘురామ ఏమన్నారంటే? 


ఇటీవల ఎంపీ భరత్ పై రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనని కమెడియన్ గా సంబోధిస్తూ, తనకు తానే హీరోనని అనుకునే ఓ వ్యక్తి ఎలా ఉంటాడో ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పార్లమెంటులోనూ మేకప్ వేసుకొని తిరిగే ఆ ఎంపీతో ఎవరు మాట్లాడిస్తున్నారో అందరికీ తెలుసన్నారు.  అతను మాట్లాడుతూ లాఠీ గుర్తుందా? అంటున్నారని, తనని కొట్టిన వాళ్లలో ఈయన కూడా ఉన్నారా? అని ప్రశ్నించారు. అతడికి ఆ వీడియో చూసిన వ్యక్తి చెప్పాడా? లేకపోతే ఆ వీడియో చూపెట్టిన వ్యక్తి చెప్పాడా అని నిలదీశారు. పోలీసులు తనని కొట్టిన మాట వాస్తవమేనని, లాఠీ గుర్తుందా అంటే కచ్చితంగా తనకు గుర్తుందని, తనను కొట్టిన వాడిని, కొట్టించిన వాడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టనన్నారు. తాను భాగస్వామ్యం వహించే ప్రభుత్వం వచ్చాక కచ్చితంగా బాకీ తీర్చుకుంటానని ఎంపీ రఘురామ అన్నారు.