Raghurama :   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై గతంలో తాను చేసిన విమర్శలనే ఇప్పుడు జేపీ నడ్డా, అమిత్ షా చేశారని.. తనను కొట్టినట్లే అమిత్ షా, నడ్డాను కొడతారా? అని ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన పలు అంశాలపై స్పందించారు.  ఏపీ ప్రభుత్వం అవినీతిమయమని అమిత్ షా చెప్పారన్నారు.  అమిత్ షా సూటిగా ఏపీ ప్రభుత్వంపై క్షిపణిలా దాడి చేశారని  వ్యాఖ్యానించారు.   కేంద్రం పథకాలను తమవిగా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంనిద మొన్న నడ్డా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారన్నారు.  ఏపీలో ల్యాండ్, ఇసుక, మైనింగ్, ఎడ్యుకేషన్ అన్నిట్లో అవినీతి అన్నారని  గుర్తు చేశారు.   నడ్డా, అమిత్ షా చెప్పిన మాటలే నేను గతంలో చెప్పానని  ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నానని నన్ను అరెస్ట్ చేసి నా పై రాజద్రోహం కేసు పెట్టారన్నారు. ఇప్పుడు  అమిత్ షా, నడ్డా వ్యాఖ్యలపై జగన్ రెడ్డి స్టాండ్ ఏమిటి? - నన్ను కొట్టినట్టు అమిత్ షా, నడ్డాను కొడతారా?  అని ఎంపీ రఘురామకృష్ణ రాజు ప్రశ్నించారు. 


జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌  తలపెట్టిన యాగం విజయవంతం కావాలని ఎంపీ రఘురామకృష్ణరాజు  ఆకాంక్షించారు. పవన్ వారాహి యాత్ర విజయవంతం కావాలన్నారు. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయని జోస్యం చెప్పారు. జగనన్న విద్య దీవెన సభలో రాజకీయాలు మాట్లాడడం ఎందుకు? అని ప్రశ్నించారు. విద్య వ్యవస్థకు సీఎం జగన్  చేస్తున్నది ఏమిటీ? అని ప్రశ్నించారు. జగన్‌ బయోపిక్  తీస్తున్నారని అంటున్నారని, ప్రజలు ఎవరూ ఆ సినిమా చూడరని రఘురామరాజు పేర్కొన్నారు.                          


ఆదివారం రోజు మీడియాతో మాట్లాడిన రఘురామ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరగడం ఖాయమన్నారు  జోస్యం చెప్పారు.  ఆగస్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రభుత్వాన్ని రద్దు చేయొచ్చని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వ్యాఖ్యలను పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు పుట్టే అవకాశాలు కనిపించడం లేదని.. అప్పు లభించకపోతే ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని నడపలేరన్నారు. అందుకే చేసేది ఏమి లేక ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే జగన్ ముందున్న మార్గం అన్నారు.                    


ముందస్తు ఎన్నికల కోసమే తమ పార్టీ ప్రభుత్వం చాప కింద నీరులా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయిస్తోందని రఘురామ ఆరోపించారు. గుంటూరులో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు వెలుగు చూశాయని.. అలాగే విశాఖపట్నం తూర్పులోనూ ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులకు చెందిన 30 వేల ఓట్లను అక్రమంగా తొలగించారని.. తమ పార్టీ సానుభూతిపరుల ఇండ్లలో లేని వారి పేరిట దొంగ ఓట్లను నమోదు చేస్తూ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని అన్నారు.