ముఖ్యమంత్రి జగన్ ( CM Jagan ) ఢిల్లీకి స్వయంగా వెళ్లలేదని ప్రధానమంత్రి ( PM Modi ) పిలిపించారని వైఎస్ఆర్‌సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ( MP Raghurama ) తెలిపారు. ఎందుకు పిలిపించారో తనకు తెలుసన్నారు. ఢిల్లీలో ( Delhi ) మీడియాతో మాట్లాడిన రఘురామ కృష్ణరాజు ఏపీలో కార్పొరేషన్ల పేరుతో అడ్డగోలుగా చేస్తున్న రుణాల విషయంలో మందలించడానికే్ జగన్‌ను ప్రధాని మోదీ పిలిపించారన్నారు. తనను ప్రధాని మందలించారని కొంత మంది ప్రచారం చేస్తున్నారని జగన్ నర్సరావుపేటలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల సమయంలో తాను ప్రధాని మాత్రమే గదిలో ఉన్నామని వారేమైనా సోఫా కింద ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ కామెంట్లపై రఘురామ స్పందించారు. ప్రధాని మోదీ పిలిపించడానికి కారణం అప్పులేనని తెలిపారు.
పార్థసారధి మృతదేహాన్ని వైఎస్ఆర్‌సీపీకే దానం ఇస్తున్నామన్న కుటుంబసభ్యులు - కుప్పంలో టెన్షన్ టెన్షన్ !
ఏపీలో పవర్ హాలీడే ( Power Holiday ) ప్రకటిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా రఘురామరాజు విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు విధించడం దారుణమన్నారు. ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే విద్యుత్ కొరత ( Power Cuts ) ఏర్పడిందని ప్రజలకు కరెంట్ కూడా ఇవ్వలేని దిక్కుమాలిన, దద్దమ్మ ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమని ( Jagan Governament ) రఘురామ విమర్శించారు. మంత్రివర్గ విస్తరణపైనా తనదైన రీతిలో సెటైర్లు వేశారు. సీఎం పదవినే ఎవరికైనా ఇస్తే బాగుంటుందన్నారు. దమ్ముంటే బొత్స సత్యనారాయణ, కొడాలి నానిలను మంత్రి పదవుల నుంచి తప్పించాలని రఘురామ సవాల్ చేశారు. వారిని తప్పిస్తే వైఎస్ఆర్‌సీపీలో సంక్షోభం వస్తుందన్నారు. సీఎం జగన్ మంత్రులందరి వద్ద రాజీనామాలు తీసుకున్నారు. తమను కొనసాగంచాలని సీనియర్లు ఒత్తిడి చేస్తున్నారని ప్రచారం సాగుతున్న తరుణంలో రఘురామ ఇలాంటి సవాల్ చేయడం ఆసక్తి రేపుతోంది.
చంద్రబాబు, పవన్ నా వెంట్రుక కూడా పీకలేరు : సీఎం జగన్
మరో వైపు రఘురామపై పోలీసుల దాడిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ.. కేంద్రం, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత 2 వారాల్లో రీజాయిండర్ దాఖలు చేసేందుకు.. రఘురామకృష్ణరాజు తనయుడు భరత్‌కు అవకాశం ఇచ్చింది. 4 వారాల తర్వాత కేసును లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రఘురామపై పోలీసుల దాడిపై సీబీఐ విచారణ జరపాలంటూ.. ఆయన కుమారుడు భరత్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.