Raghuramakrishna Raju   : ఎంపీ రఘురామ కృష్ణరాజు ఈ సారి సంక్రాంతి పండుగను సొంత నియోజకవర్గంలో చేసుకోనున్నారు. ఢిల్లీ నంచి  రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.  భారీ ఘజమాలతో ఘన స్వాగతం పలికిన ఎంపీ RRR అభిమానులు భీమవరం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఈ స్ధాయికి చేరడానికి కారణమైన సీఎం జగన్ కు ఆయన థ్యాంక్స్ చెప్పారు. తనకు ఈ నాలుగేళ్ల పాటు మద్దతు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్, పవన్ తో పాటు తనను ఈ స్ధాయికి తీసుకొచ్చినందుకు జగన్ కు కూడా ఆయన థ్యాంక్స్ చెప్పారు.                    

  


రాజమండ్రి ఎయిర్ పోర్టులో ఇవాళ ఉదయం రఘురామ ఎంట్రీ ఇచ్చే వరకూ ఉత్కంఠ కొనసాగింది. రఘురామరాజు ఎయిర్ పోర్టు నుంచి బయిటికి రాగానే ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే రఘురామ ఎలాంటి ఆటంకాలు లేకుండా బయటికి రావడం, ఆయనకు అభిమానులు ఘనంగా స్వాగతం పలకడం జరిగిపోయాయి.               


వైసీపీతో విబేధించడంతో ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయి.  నియోజకవర్గానికి వస్తే అరెస్టులు చేస్తారన్న కారణంగా  నాలుగేళ్ల పాటు రఘురామను నియోజకవర్గానికి రాకుండా ఉన్నారు.  ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా అరెస్టు చేసేందుకు వీలు లేకుండా హైకోర్టు నుంచి ఉత్తర్వలు తెచ్చుకున్నారు రఘురామ. తెలియకుండా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారని.. రక్షణ కల్పించాలని రఘురామ..తనపై ఇంత వరకూ చేసిన తప్పుడు కేసుల వ్యవహారం.. సీఐడీ ఓ సారి అదుపులోకి తీసుకుని ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన అంశాన్నీ వివరించారు. వాదనలు విన్న హైకోర్టు రఘురామకృష్ణరాజుపై నమోదు చేసిన కేసుల విషయంలో 41ఏ సెక్షన్ విధివిధానాలను తప్పనిసరిగా అనుసరించాల ని, అరెస్ట్ నుంచి రఘురామకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో ఓ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది.                                                                     


రఘురామ నాలుగేళ్ల తర్వాత నియోజవకర్గానికి వస్తూండటంతో బలప్రదర్శన చేస్తున్నారు.  ఎయిర్ పోర్టులో ధిగ్గినప్పటి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.  నాలుగేళ్ల పాటు ఆజ్ఞాతవాసం పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మరింత బలంతో ఆయన జగన్ రెడ్డికి సవాల్ విసిరే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ, జనసేన తరపున తరపున నర్సాపురం నుంచే  పోటీ చేస్తానని అంటున్నారు.