Tirupati Railway Station Contro : ప్రసిద్ద పుణ్యక్షేత్రం తిరుపతి అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ అక్కడ రైల్వే స్టేషన్ సాదాసీదాగా ఉంటుంది. అనేక రైల్వే బడ్దెట్లలో తిరుపతి రైల్వేస్టేషన్లను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. చివరికి ఇప్పటికి సాకారం అవుతోంది. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ గుడ్ న్యూస్ చెప్పారు. ట్విట్టర్‌లో డిజైన్లను ప్రకటించి... కాంట్రాక్టులు కూడా ఇచ్చేశామని ఇక పని చేయడమే మిగిలిందని ప్రకటించారు.
అయితే కేంద్ర రైల్వే మంత్రి చూపించిన గ్రాఫిక్స్ చూసిన తర్వాత అందరూ డీలాపడిపోయింది. ఎందుకంటే.. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్.. సౌకర్యాలు కల్పిస్తారేమో కానీ.. పైన డిజైన్ మాత్రం.. తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ప్రతిబింబించేలా లేదు. ఓ సాదా సీదా భవనంలా ఉంది. ఇంకా చెప్పాలంటే ఓ ఐటీకంపెనీ బిల్డింగ్‌లా ఉంది. తిరుపతి.. తిరుమల శ్రీనివాసుడ్ని గుర్తు తెచ్చేలా డిజైన్ ఉండాలన్న సూచనలు నెటిజన్ల నుంచి కేంద్రమంత్రికి వస్తున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఇదే అంశంపై ట్వీట్ చేశారు.
ఇది సోవియట్ డిజైన్లలా ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
మంత్రి ట్వీట్‌కు వచ్చిన కామెంట్లను చూస్తే ఆ డిజైన్లపై ఎవరికీ సానుకూలత రాలేదని మార్చాలని కేంద్రమంత్రికే సూచించారు కొందరు.
మరి కేంద్రమంత్రి ఏం చేస్తారో చూడాలి !