Breaking News Telugu Live Updates: మునుగోడు ఎన్నికల్లో ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు: రేవంత్ రెడ్డి

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP DesamLast Updated: 22 Apr 2023 06:25 PM

Background

రంజాన్‌ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రార్థనల్లో భారీ సంఖ్యలో ముస్లిం పాల్గొంటున్నారు. పండగ వేళలో ట్రాఫిక్ జామ్‌లు లేకుండా హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. పాతబస్తీ, మిరాలం ఈద్గా, చార్మినార్‌,...More

మునుగోడు ఎన్నికల్లో ఎవరినుంచి డబ్బులు తీసుకోలేదు: రేవంత్ రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణం చేశారు. మునుగోడు ఎన్నికల్లో భాగంగా తాను ఎవరితోనూ డబ్బులు తీసుకోలేదన్నారు. డబ్బులు పంచం, చుక్క మందు కూడా పోయం అని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి చెప్పారు. అదే విధంగా ఎన్నికల్లో పోరాడామన్నారు. కానీ బీజేపీ నేతలు ఈడీ, సీబీఐలు తమ వద్దే ఉన్నా, ఈటల రాజేందర్ ఇష్టరీతిన మునుగోడు ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, పాల్వాయి స్రవంతికి బీఆర్ఎస్ నుంచి నగదు సహాయం లభించిందని ఈటల చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆధారాలు లేవు కనుక ఈటల అమ్మవారి ఆలయానికి రాలేదని, ప్రమాణం చేయలేదన్నారు.