PM to visit Andhra Pradesh on 16th October: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తారు. ఉదయం 11:15 గంటలకు నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో పూజలు, దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:15 గంటలకు శ్రీశైలంలోని శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి కర్నూలుకు వెళ్లి అక్కడ మధ్యాహ్నం 2:30 గంటలకు దాదాపు రూ. 13,430 కోట్ల విలువైన   అభివృద్ధి ప్రాజెక్టులను   శంకుస్థాపన , జాతికి అంకితం చేస్తారు.  బహిరంగ సభలో ప్రసంగిస్తారు.   

Continues below advertisement

శ్రీశైలంలో ప్రధానమంత్రి

Continues below advertisement

12 జ్యోతిర్లింగాలలో ఒకటి , 52 శక్తి పీఠాలలో ఒకటి అయిన   భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రధానమంత్రి పూజ, దర్శనం చేస్తారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటంటే, జ్యోతిర్లింగం , శక్తి పీఠం ఒకే ఆలయ ప్రాంగణంలో ఉండటం . ప్రధానమంత్రి  శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు, ఇది నాలుగు మూలల్లో  ధ్యాన మందిరం కలిగిన స్మారక సముదాయం. ప్రతాప్‌గడ్, రాజ్‌గడ్, రాయ్‌గడ్ ,  శివనేరి - దీని మధ్యలో లోతైన ధ్యానంలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది. 

కర్నూలులో ప్రధానమంత్రి

ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ దాదాపు రూ.13,430 కోట్ల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం , జాతికి అంకితం చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పరిశ్రమ, విద్యుత్ ప్రసారం, రోడ్లు, రైల్వేలు, రక్షణ తయారీ, పెట్రోలియం ,సహజ వాయువు వంటి కీలక రంగాలలో ఉన్నాయి. ఇవి ప్రాంతీయ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం , రాష్ట్రంలో సమ్మిళిత సామాజిక-ఆర్థిక వృద్ధిని నడిపించడం కోసం ఉపయోగపడతాయి.  రూ. 2,880 కోట్లకు పైగా పెట్టుబడితో విద్యుత్ వ్యవస్థ బలోపేతం కోసం కర్నూలు-III పూలింగ్ స్టేషన్‌   ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్టులో 765 KV డబుల్-సర్క్యూట్ కర్నూలు-III పూలింగ్ స్టేషన్-చిలకలూరిపేట ట్రాన్స్‌మిషన్ లైన్ నిర్మాణం కూడా ఉంది. 

కర్నూలులోని ఓర్వకల్  , కడపలోని కొప్పర్తి పారిశ్రామిక  కారిడార్‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు, మొత్తం రూ. 4,920 కోట్లకు పైగా పెట్టుబడితో  నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (NICDIT)   ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (APIIC) సంయుక్తంగా అభివృద్ధి  చేస్తున్నాయి.  ఆధునిక, బహుళ-రంగ పారిశ్రామిక కేంద్రాలు ప్లగ్-అండ్-ప్లే మౌలిక సదుపాయాలు,  వాక్-టు-వర్క్  ఫెసిలిటీతో ఇవి ఉంటాయి.  ఇవి రూ. 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని , సుమారు లక్ష ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు. 

విశాఖలో రూ. 960 కోట్లతో సబ్బవరం నుండి షీలానగర్ వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు ప్రధానమంత్రి పునాది రాయి వేస్తారు.  పీలేరు-కలూరు సెక్షన్ నాలుగు లేన్లుగా విస్తరించడం, కడప/నెల్లూరు సరిహద్దు నుండి సిఎస్ పురం వరకు విస్తరణ, NH-165లో గుడివాడ , నూజెళఅల రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు లేన్ల రైల్ ఓవర్ బ్రిడ్జి (ROB), NH-716లో పాపాగ్ని నదిపై ప్రధాన వంతెన, NH-565లో కనిగిరి బైపాస్, NH-544DDలోని N. గుండ్లపల్లి టౌన్‌లోని బైపాస్డ్ సెక్షన్ మెరుగుదల వంటి ప్రాజెక్టులు ఉన్నాయి.  కొత్తవలస-విజయనగరం నాల్గవ రైల్వే లైన్ , పెందుర్తి - సింహాచలం నార్త్ మధ్య రైల్ ఫ్లైఓవర్ కు శంకుస్థాపన, కొత్తవలస-బొడ్డవర సెక్షన్ ,  శిమిలిగూడ-గోరాపూర్ సెక్షన్ డబ్లింగ్ పనులను దేశానికి అంకితం చేస్తారు.  

ఇంధన రంగంలో, ప్రధానమంత్రి గెయిల్ ఇండియా లిమిటెడ్  కాకుళం-అంగుల్ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్‌ను జాతికి అంకితం చేస్తారు, ఇది మొత్తం రూ. 1,730 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్‌లో 124 కి.మీ ,డిశాలో 298 కి.మీ. విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో సుమారు రూ. 200 కోట్ల పెట్టుబడితో స్థాపించి  ఇండియన్ ఆయిల్   60 TMTPA (సంవత్సరానికి వెయ్యి మెట్రిక్ టన్నులు) LPG బాట్లింగ్ ప్లాంట్‌ను కూడా  ప్రారంభిస్తారు.