JioHotstar Down  Users Across India Report Streaming Issues:  భారతదేశవ్యాప్తంగా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం గురువారం ఉదయం నుంచి పనిచేయడం మానేసింది.   వినియోగదారులు   మూవీలు, టీవీ షోలు, లైవ్ స్పోర్ట్స్‌లు స్ట్రీమ్ చేయడంలో సమస్యలు, లాగిన్ ఫెయిల్యూర్లు, యాప్ క్రాష్‌లు, బఫరింగ్ వంటి సమస్యలు  ఎదుర్కొన్నారు. లక్షల మంది  జియో హాట్ స్టార్ డౌన్ అయిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Continues below advertisement

ఈ సమస్యలు గురువారం ఉదయం 9 గంటలకు ముందు ప్రారంభమైనట్లు వినియోగదారులు తెలిపారు. X (మాజీ ట్విటర్)లో వేలాది పోస్టులు  "వీడియోలు లోడ్ కావట్లేదు, సర్వర్ ఎర్రర్ చూపిస్తోంది" అని, "సెర్చ్ ఆప్షన్ పని చేయట్లేదు, ప్రొఫైల్ కూడా కనిపించట్లేదు" అని ఫిర్యాదు చేశారు.  "జియో హాట్‌స్టార్ యాప్‌లో వీడియోలు లోడ్ కావట్లేదు లేదా సర్వర్ ఎర్రర్లు చూపిస్తున్నాయి. తాత్కాలిక ఔటేజ్‌గా కనిపిస్తోంది" అని  కొంత మందిపేర్కొన్నారు.    

  వీడియోలు ప్లే అవ్వకపోవటం, బఫరింగ్, లేదా "అన్‌ఎబుల్ టు కనెక్ట్ టు జియో హాట్‌స్టార్" అనే మెసేజ్ చూపడం వంటి సమస్యలు సాధారణంగా  మారాయి.  సెర్చ్ ఆప్షన్ పని చేయకపోవటం, సెట్టింగ్స్ ఆప్షన్ కనిపించకపోవటం, ప్రొఫైల్ లేదా సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ చూడలేకపోవటం వంటివి ఎక్కువ మంది వినియోగదారులు ఫేస్ చేశారు.  లాగిన్ ఫెయిల్యూర్లు, అకౌంట్ లోడ్ కాకపోవటం వంటివి ఎక్కుగా చోటు చేసుకున్నాయి. 

 భారతదేశవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.  బిగ్ బాస్, క్రికెట్ మ్యాచ్‌లు వంటి లైవ్ కంటెంట్ చూడాలనుకునే వారు నిరాశకు గురయ్యారు.  డౌన్‌డిటెక్టర్ వంటి సైట్‌ల ప్రకారం, జియో నెట్‌వర్క్‌లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కానీ ప్రధాన సమస్య జియో హాట్‌స్టార్ యాప్‌కు సంబంధించినది.   

   "కొన్ని నిరోధించలేకపోయిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది వినియోగదారులు స్ట్రీమింగ్ లేదా ప్లాట్‌ఫాం యాక్సెస్‌లో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరించడానికి మేము పని చేస్తున్నాం. అసౌకర్యానికి క్షమాపణలు చెబుతున్నాం" అని జియో హాట్‌స్టార్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ @hotstar_helps నుంచి వచ్చిన వివరణోలేర్కొన్నారు.  అంటే జియో హాట్ స్టార్ ప్లాట్‌ఫాం "టెక్నికల్ ఇష్యూ"ను ఒప్పుకుని, పరిష్కారానికి పని చేస్తోందని ప్రకటించినట్లయింది.  జియో సినిమా మరియు డిస్నీ+ హాట్‌స్టార్ మెర్జర్ తర్వాత ఏర్పడిన జియో హాట్‌స్టార్, భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి.