Prakash Raj targets Pawan Kalyan: సినిమాలో ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్‌లు రక్తికట్టిస్తాయి. రాజకీయాల్లోనూ వీరు తమ వాదాలకు అనుగుణంగా తలపడుతున్నారు. ప్రకాష్ రాజ్  ప్రత్యేకంగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ ఆయన కొన్ని అంశాలపై జస్ట్ ఆస్కింగ్ పేరుతో ప్రశ్నిస్తూ ఉంటారు. ఇటీవల తిరుమల లడ్డూ ఇష్యూ తర్వాత  పవన్ ఎత్తుకున్న సనాతన ధర్మం అంశంపైనా సెటైర్లు వేశారు. ఇప్పుడు తమిళ భాష అంశంపై పవన్ చేసిన వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్నారు.  



తాజాగా సోషల్ మీడియాలో పవన్ కు ఓ ప్రశ్న సంధించారు ప్రకాష్ రాజ్.  గెలవక ముందు “జనసేనాని” గెలిచిన తరువాత “భజన సేనాని” అంతేనా అని ప్రశ్నించారు. గతంలో హిందీ భాషను రుద్దడంపై పవన్ సిద్దాంతాలను  ప్రకాష్ రాజ్ సాక్ష్యంగా పోస్టు చేశారు.  



అంతకు ముందు "మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్ అని పోస్టు పెట్టారు. 


ప్రకాష్ రాజ్ పెట్టిన ఈ రెండు పోస్టులు వైరల్ గా మారాయి. అయితే పవన్ హిందీ భాష అంశంపై తన అభిప్రాయం ఏమిటో చెప్పారు. ప్రతి ఇండియన్ కు భాషపై ఎవరి స్వేచ్చ వారికి ఉండటమే జనసేన అభిమతమన్నారు.  



ప్రకాష్ రాజ్ ఈ విషయంలో పవన్ ను వదిలే అవకాశం కల్పించడం లేదు. మరిన్ని ట్వీట్లతో ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.   పవన్ కల్యాణ్  కు ప్రకాష్ రాజ్ కు వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. వారు కలిసి ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఉంటారు.  పవన్ కల్యాణ్ రాబోయే సినిమాల్లోనూ ప్రకాష్ రాజ్ కీలక  పాత్ర పోషిస్తూ ఉంటారు. అయితే  ఇరువురూ.. తమ రాజకీయ వివాదాలను..  ప్రొఫెషనల్ గా తీసుకోరు.  వాదాలు.. ప్రతివాాదాలు...  రాజకీయాలు, సోషల్ మీడియాకే పరిమితం చేసుకుంటారు.