Prakash Raj And Vishnu on Sack Jailed Ministers bill: 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31 రోజున మంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా.. ప్రధానమంత్రి అయినా సరే పదవి పోయే చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. లోక్ సభలో బిల్లు పెట్టింది. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. అయితే ఇప్పుడీ బిల్లుపై బయట విస్తృతమైన చర్చ జరుగుతోంది. కొంత మంది చాలా అనుమానాలతో సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో బీజేపీని ప్రశ్నించే ప్రకాష్ రాజ్ కూడా..ఈ బిల్లుపై సెటైరిక్ గా స్పందించారు.
తనకో చిలిపి సందేహం వచ్చిందనది కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక , మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినె ఉపముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ?? అని ప్రశ్నిస్తూ ట్వీట్ పెట్టారు.
దీనికి ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీరు చెప్పిన బిల్లు అసెంబ్లీలో కాకుండా సినిమాలో, సీరియల్‌లో షూట్ చేస్తే బాగుంటుంది. అక్కడే ఒక్క ఎపిసోడ్‌లో సీఎం, డిప్యూటీ సీఎం, ఎక్స్ సీఎం అందరూ కుర్చీలు మార్చేసుకుంటారు . అసలైన పార్లమెంట్ బిల్లుల్లో ఇంత మసాలా దొరకదు గానీ, మీ ఊహకు మాత్రం TRP గ్యారెంటీ అని కౌంటర్ ఇచ్చారు
ప్రకాష్ రాజ్.. మొదట్లో బీజేపీపై తీవ్ర విమర్శుల చేసేవారు. ఆ తర్వాత తన దృష్టిని పవన్ కల్యాణ్ పై కేంద్రీకరించారు. పవన్ పై చాలా విషయాల్లో వాదనలు పెట్టుకున్నారు. విమర్శలు చేశారు. సోషల్ మీడియాలో జస్ట్ ఆస్కింగ్ అని ప్రశ్నలు వేసేవారు. అయితే పవన్, ప్రకాష్ రాజ్ కలిసి మళ్లీ సినిమా షూటింగ్‌లలో పాల్గొనేవారు. ప్రకాష్ రాజ్ ఇలా తనకు పబ్లిసిటీ వస్తుందని అనుకునే అంశాల్లో.. ప్రముఖులపైనే విమర్శలు చేస్తారన్న విమర్శలు కూడా ఉన్నాయి.