Praveen Pagadala died in a road accident : పాస్టర్ ప్రవీణ్ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు ఫోరెన్సిక్ రిపోర్టులో స్పష్టం అయిందని పోలీసులు ప్రకటించారు.  ఏలూరు రేంజ్ ఐజీ ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టి కీలక విషయాలను వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ సికింద్రాబాద్ నుంచి బయలుదేరినప్పటి నుండి దాదాపు 400 సిసి టీవీ ల ఫుటేజ్ లను పరిశీలించామమన్నరాు.  పాస్టర్  ప్రవీణ్ కు జగ్గయ్యపేట వద్ద పెద్ద ప్రమాదం తప్పిందని..  ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో ప్రాణాలతో  బయటపడ్డారన్నారు.  చిల్లకల్లు టోల్ ప్లాజా వద్దకు సాయంత్రం మూడున్నర గంటలకు చేరుకున్నారు. అక్కడ   టోల్ ప్లాజా దగ్గర స్తంభానికి బలంగా గుద్దుకున్నారని తెలిపారు.  ఆయనకు సాయం చేసేందుకు వైద్య సిబ్బంది కూడా అక్కడికి వెళ్లారు. కానీ వైద్య సేవలు పొందడానికి ఆయన అంగీకరించలేదన్నారు. 

గొల్లపూడి వచ్చే సరికే పలుమార్లు ప్రమాదాలు         ఇక్కడి నుంచి మళ్లీ  బయలుదేరారని  గొల్లపూడి లో పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి ఆయన బండి హెల్మెట్ పూర్తిగా పగిలిపోయిందన్నారు.  విజయవాడ సమీపంలోని రామవరప్పాడు వద్ద ఆయన మరోసారి పడిపోయారని ఐజీ తెలిపారు.  దగ్గర్లో ఉన్న వ్యక్తులు ఆయనకు సహాయం చేసి టి తాగమని ఇచ్చారన్నారు.  ఏలూరులోని నిపున్ టానిక్ వైన్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేశారని..  చాలా దూరం అయిన సిగ్నల్ లైట్ ఆధారంతో డ్రైవింగ్ చేశారన్నారకొవ్వూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత ఆయన మితిమీరిన వేగంతో బండి డ్రైవింగ్ చేశారని.. తెలిపారు.  

మద్యం మత్తులో అత్యంత వేగంగా డ్రైవింగ్        

బండి పడిపోవడానికి గల కారణాలు ఫోరెన్సిక్ వారు స్పష్టంగా గుర్తించారు.  ప్రమాద సమయంలో ఆయన సుమారు 70 కిలోమీటర్ల వేగంతో బండి డ్రైవ్ చేస్తున్నారు.‌ప్రమాదం జరిగిన సమయంలో బండి నాలుగవ గేర్ లో ఉందని తెలిపారు.  గతంలో కూడా రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన మద్యం షాపులో మద్యం కొనుగోలు చేశారు.హైదరాబాదు నుంచి రాజమండ్రి చేరుకునేసరికి మధ్యలో ఆయన ఆరుసార్లు ఫోన్ మాట్లాడారు.  మార్గమధ్యంలో ఆయన నాలుగుసార్లు ఫోన్ పే వాడారు.   ఆయన శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారన్నారు.  ఆయనకు తగిలిన దెబ్బలు రోడ్ యాక్సిడెంట్ వల్ల తగినట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు.   ప్రవీణ్ కుమార్ పగడాల యాక్సిడెంట్ జరిగి చనిపోయినట్లుగా నిర్ధారణ అయిందన్నారు.           

తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు           

సికింద్రాబాద్ కు చెందిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ రాజమండ్రి వద్ద రోడ్డు పక్కన చనిపోయి ఉండటం  వివాదాస్పదమయింది. ఆయనను చంపేశారని కొంత మంది ఆందోళనలు నిర్వహించారు. చివరికి ప్రభుత్వం పూర్తి స్థాయి దర్యాప్తు చేసింది. పాస్టర్ ప్రవీణ్  పగడాల మృతిని ఆధారం చేసుకుని చాలా మంది మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నించారన్న  ఆరోపణలు కూడా వచ్చాయి. తప్పుడు ప్రచారం చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు.