POCSO case against former Kodumuru MLA Sudhakar :  సీపీ నేత, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో పనిచేసే బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా కేసు నమోయింది.  గురువారం ఆయనను అరెస్టు చేసి  వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు. తన ఇంట్లో పనిచేసే బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సుధాకర్ పై ఆరోపణలు ఉన్నాయి.  లైంగిక వేధింపులకు సంబంధించి ఏపీ ఎన్నికలకు ముందు ఒక వీడియో కూడా వైరల్‌గా మారింది.   అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఆయనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. బాధిత బాలిక కూడా ఫిర్యాదు చేయలేదు. 


చిన్న పిల్లపై లైంగిక వేధింపులు


ప్రైవేటుగా పంచాయతీ నిర్వహించారని ప్రచారం జరిగింది. సుధాకర్ పెద్దలతో చేసిన పంచాయతీ కుదరకపోవడంతో బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.  ప్రస్తుతం సుధాకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఓర్వకల్ మండల పోలీసు స్టేషన్ కు తరలించి విచారణ నిర్వహిస్తున్నారు.  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్య పరీక్షల అనంతరం రిమాండ్‌కు తరలించారు. బాలిక మైనర్ కావడంతో పోక్సో కేసు పెట్టారు. 


12 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను లైంగికంగా వేదిస్తే పోక్సో కేసు 


2012లో వచ్చిన పోక్సో చట్టం  18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్ష అమలయ్యేలా ఈ చట్టాన్ని రూపోందించారు . వారిపై అత్యాచారం పాల్పడ్డ దోషులకు మరణశిక్ష విధిస్తారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన వారికి జీవిత ఖైదుగా 10 సంవత్సరాల నుండి 7 సంవత్సరాల వరకు కఠినంగా శిక్షిస్తారు. 16 ఏళ్లలోపు బాలికపై అత్యాచారం జరిగితే కనీస శిక్షగా 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు జీవితం అనుభవించాల్సి ఉంటుంది. అత్యాచార కేసుల వేగవంత విచారణ కోసం ప్రభుత్వం కాలపరిమితిని సూచించింది. తప్పనిసరిగా రెండు నెలల్లో కేసు పూర్తి చేయాలని పరిమితి విధించింది.


2019లో ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిచిన సుధాకర్ 


2019 ఎన్నికల్లో సుధాకర్‌ కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయనపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో 2024 ఎన్నికల్లో జగన్‌ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. సుధాకర్‌ స్థానంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ సోదరుడు సతీశ్‌కు టికెట్‌ కేటాయించారు. దంత వైద్యుడు అయిన సుధాకర్ ఇలా తన ఇంట్లో పని చేసే బాలికను కొన్నాళ్లుగా వేధిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరికి ఆ బాలికే రహస్యంగా వీడియో తీసి బయటకు లీక్ చేయడంతో సుధాకర్ వేధింపుల గురించి వెలుగులోకి వచ్చింది. బయటకు వచ్చిన వీడియోలో సదరు యువతితో ఎమ్మెల్యే సంభాషణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు ఇస్తాను. ఇంట్లో మేడం కూడా లేదంటూ సాగించిన రాసలీలల సంభాషణ కర్నూల్ జిల్లా అంతటా చర్చనీయాంశం అయింది. అప్పటికే జగన్ టిక్కట్ నిరాకరించడంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.