Pingali Venkaiah Daughter: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుమార్తె ఘంటశాల.సీతా మహాలక్ష్మి గురువారం సాయంత్రం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. చాలా రోజులుగా ఆమె మాచర్ల పట్టణంలోని ప్రియదర్శిని కాలనీలో ఆమె కుమారుడు జీవీ నరసింహారావు ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న చాలా మంది ఆమె మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.


ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్కు..


స్వతంత్ర వచ్చి 75  వసంతాలు పూర్తి అయిన  సందర్భంగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 15వ తేదిన స్వయంగా వారి ఇంటికి వెళ్ళి సీతామహాలక్ష్మిని  ఘనంగా సన్మానించారు. ఆమెతో చాలా ఆత్మీయంగా మాట్లాడారు. ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్కును కూడా ఆమెకు అందజేశారు. అలాగే పింగళి వెంకయ్య రాసిన పుస్తకాన్ని కూడా బహుకరించారు. భరతమాత ఒడిలో ఉన్న పింగళి వెంకయ్య ఉన్నట్లుగా కనిపించే పెయింటింగ్ ను కూడా సీతామహాలక్ష్మికి సీఎం జగన్ బహుకరించారు. అలాగే జాతీయ పతాకాన్ని, ఓ షీల్డును, జాతీయ నాయకుల ఫొటోను కూడా అందజేశారు. సీతామహాలక్ష్మి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె చనిపోవడం చాలా బాధగా ఉందన్నారు.


సుస్థిరాభివృద్ధి కోసం సీఎం జగన్.. 


అలాగే రాష్ట్రంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఇప్పుడు జరుగుతున్నంత ప్రయత్నం గతంలో ఎప్పుడూ జరగలేదని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఎస్డీజీ సాధన్ దిశగా కృషి చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని తెలియజెప్పడం కూడా అంతే అవసరం అని పేర్కొన్నారు. అమ్మ ఒడి, పాఠశాలల నిర్వహణ నిధి, మరుగుదొడ్ల నిర్వహణ నిధితో పాటు సంపూర్ణ పోషణ, గోరుముద్ద పథకాల గురించి సక్రమంగా రిపోర్టింగ్ చేయలేదని తెలిపారు. రిపోర్టింగ్ సక్రమంగా లేనప్పుడు మనం ఎంత పని చేసినా లాభం లేదని వివరించారు. 


పేదలందరికీ సంక్షేమ పథకాలు..


జాతీయ స్థాయిలో పోటీ పడడం ద్వారా దేశంలో మొదటి స్థానంలో నిలిచేందుకు మనకు అవకాశం వచ్చిందని.. గతంలో ఈ పరిస్థితి లేదని సీఎం జగన్ వివరించారు. మనం అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలోనూ లేవని చెప్పరు. ముందే క్యాలెండర్ ప్రకటించి డీబీటీ ద్వారా లబ్దిదారుల ఖాతాల్లోకే డబ్బులు వేస్తున్నామన్నారు. అవినీతి, వివక్షతకు తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామన్నారు. ఎస్ జీడీ రిపోర్టును ప్రతి నెలా కలెక్టర్లు పర్యవేక్షించాలని... దానిపై విభాగాధిపతులు పర్యవేక్షమ అవసరం అని అన్నారు. అలాగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధ దిశగా జరుగుతున్న కృషిపై ఆయన గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.