Perni Nani: టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు(Chandrababu Naidu)పై మాజీమంత్రి పేర్నినాని (Perni Nani) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గడచిన 40 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ఏనాడూ తన తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తనదైన శైలిలో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవని, అంతటి దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 


ప్రతి వ్యవస్థని భ్రష్టుపట్టించారు


సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గర్వంగా తాను రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల కుమారుడినని చెప్పుకుంటారని నాని అన్నారు. తల్లి , తండ్రి చనిపోతే తలకొరివి పెట్టని చంద్రబాబు నేటికీ రామారావు అల్లుడినని చెప్పుకుంటాడని విమర్శించారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని దౌర్భాగ్యుడు చంద్రబాబు సీఎం జగన్‌ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి ఇప్పటి వరకూ రాజకీయాల్లో ప్రతి వ్యవస్థని దిగజార్చారని, బ్రస్టుపట్టించారని విమర్శించారు. అలాంటి చంద్రబాబు ఈ రోజు రాజకీయాల్లో ఉండటం అనవసరమని అన్నారు. పొలాల్లో తాడిచెట్టుకు, మర్రిచెట్టుకు కూడా వయసొస్తుందని, అలాగే చంద్రబాబుకు వయొచ్చిందే తప్ప ఉపయోగం లేదన్నారు. 80 ఏళ్ల వయసులో రబాబు ఉక్రోషంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.


రాజకీయాల్లో చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉండకూడదు


ఎన్టీఆర్‌(NT Ramarao)ను వెన్నుపోటు పొడిచి, పార్టీని కూలదోసి అన్ని వ్యవస్థలను చంద్రబాబు బ్రస్టుపట్టించారని మండిపడ్డారు. తండ్రిపేరు చెప్పుకోవడానికి సిగ్గుపడే చంద్రబాబు దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. రాజకీయాల్లో చంద్రబాబులాంటి వ్యక్తులు ఉండకూడదు అనే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. హిందువునని చెప్పుకునే చంద్రబాబు తల్లి చనిపోతే తలకొరివి పెట్టలేదని, జట్టు తీయలేదని అన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నీతులు చెబుతున్నారని విమర్శించారు.


వైసీపీ జెండాను టచ్ చేయలేరు


చంద్రబాబు తలక్రిందులుగా తపస్సు చేసినా వైసీపీ(YCP) జెండా నీడను కూడా టచ్ చేయలేరని పేర్నినాని అన్నారు. మరోసారి రాష్ట్రంలో వైసీపీ జెండా ఎగురుతుందన్నారు. ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలను మర్చిపోయారని, అధికారం పోయాక ఆయనకు ప్రజలు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని, ప్రజలను నమ్మించేందుకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. 2014లో ఇలాగే ప్రజలను పత్రాల పేరుతో మోసం చేశారని విమర్శించారు. 


అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు


చంద్రబాబు బతుకంతా ప్రజలకు తెలుసని పేర్ని నాని అన్నారు. అధికారంలో రావడానికి అరచేతిలో వైకుంఠం చూపిస్తాడని.. అధికారంలోకి వచ్చాక ఎలా నేల నాకిస్తాడో అందరికీ తెలుసని తెలిపారు. 2024 నాటికి మరో సారి చంద్రబాబు దొంగ హామీలతో వస్తున్నారని విమర్శించారు. 80 ఏళ్ల ముసలి చంద్రబాబు నోటికి వచ్చినట్లు సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వయసుకు తగ్గ మాటలు మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ఇంకోసారి సీఎం జగన్ కుటుంబ సభ్యులను విమర్శిస్తే ఊరుకోమన్నారు.