Pensions could not be distributed in the village secretariats  :  ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్లు చాలా చోట్ల వృద్ధులకు బుధవారం కూడా అందలేదు. రెండు విధాలుగా పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గ్రామ సచివాలయాల ఖాతాల్లో నగదు జమ చేయకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి. వేల్ఫేర్ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి నగదు తెచ్చుకునేందుకు వెళ్లినా ఖాతాల్లో నగదు లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు.                                          


నిజానికి ఈ ఒక్క రోజే కాకుండా.. మూడు  రోజుల పాటు పెన్షన్ల పంపిణీ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. మంచాన పడిన వారికి, వితంతువులకు ఇంటి వద్దనే పంపిణీ చేయాలని నిర్ణయంచారు. మిగిలిన వారికి సచివాలయాల దగ్గర పంపిణీ చేస్తారు అందరికీ ఇదే రోజు కాదు...మూడు రోజుల పాటు పంపిణ చేస్తారు.  పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఆలస్యం కావడంతో వృద్ధులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.   ఉదయం నుంచే పెన్షన్లను పంపిణీ చేస్తామని ఎందుకు చెప్పారంటూ పెన్షన్‌దారులు మండిపడుతున్నారు. చివరకు పెన్షన్ పంపిణీ లేకపోవడంతో ప్రజలు వెనుతిరిగి వెళ్లిపోయారు.                                     


కదల్లేని వాళ్లకు ఇళ్ల వద్దే పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలున్నా.. వైసీపీ నేతలు కావాలనే పబ్లిసిటీ కోసం వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారని టీడీపీ ఆరోపించింది. వైసీపీ నేతల అకృత్యాలపై ఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించింది. సోషల్ మీడియాలో టీడీపీ బద్నాం చేయడానికి వైసీపీనే కావాలని ఇలా చేసి.. వాటిని వీడియోలు తీస్తున్నారని ఈసీ దృష్టికి టీడీపీ తీసుకెళ్లింది.   అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వికలాంగులకు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేయాలని ఎలక్షన్ కమిషన్   ఆదేశాలు ఇచ్చినప్పటికీ  ఆ నిబంధనలకు వైసీపీ తూట్లు పొడిచి.. కొందరు మనుషులను పెట్టి మరీ.. కదల్లేని స్థితిలో ఉన్న వృద్ధులను మంచాలపై పడుకోబెట్టి సచివాలయాల వద్దకు తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది.                                                                


వృద్ధుల సమస్యల గురించి పట్టించుకోకుండా.. రాజకీయం చేయడం వారికి ఇబ్బందికరంగా మారింది. రాజకీయం కోసం వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి మీ వల్లే  ... మీ వల్లే అని ఏపీలోని రెండు రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి. కలెక్టర్లు ఇంటింటికి పంపిణీ చేసేందుకు ఇబ్బంది లేదని చెప్పినప్పటికీ.. ఇలా ప్రభుత్వ అధికారులు వ్యవహరించడంపై ఈసీకి ఫిర్యాదు చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది.