Payyavula  :  చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని స్కాములో సాక్ష్యాలుంటే కోర్టుకు ఇవ్వకుండా రెండు వారాల గడువు ఎందుకు అడిగారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన కీలక వివరాలను వెల్లడించారు.  చంద్రబాబుకు అవినీతి మరకను అంటించడానికి జగన్‌ కుట్ర పన్నారని మండిపడ్డారు.  అక్రమ కేసులకు టీడీపీ భయపడదు. రేపు రాజకీయ రణక్షేత్రంలో టీడీపీ పదింతలు శక్తితో ఎదుర్కొంటుంది.ప్రభుత్వం, సీమెన్స్‌, డిజైన్‌టెక్‌ ఒప్పందం చేసుకున్నాయి. సీమెన్స్‌ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. సీమెన్స్ సంస్థ అద్భుతమైన పనితీరును కనబరిచిందని 2021లోనే వైసీపీ ప్రభుత్వం ప్రశంసించిందని, ఇంకోవైపు ఒప్పందం ప్రకారం సాఫ్టువేర్, హార్డ్‌వేర్ అన్నీ అందాయని చెబుతున్నారని, మరోవైపు నిధులు పక్కదారి పట్టాయని చెబుతూ.. వాటిని ఇప్పటి వరకు నిరూపించలేకపోయారన్నారు. 


చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలని కుట్ర                                


చంద్రబాబుకు అవినీతి మరక అంటించాలనేది జగన్ కుట్ర అన్నారు. అసలు సీమెన్స్ సంస్థను కోర్టు పరిధిలోకి ఎందుకు తీసుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం, సీమెన్స్ సంస్థ, డిజైన్‌టెక్ ఒప్పందం చేసుకున్నాయని, కానీ సీమెన్స్‌ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఆ సంస్థను ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదో చెప్పాలన్నారు. కనీసం ఒక్కరూపాయి అయినా పక్కదారి పట్టించిందని నిరూపించారా? అని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ఏ ఒక్కరోజు నోటీసు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు అరెస్టుకు కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజావ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. 


సిమెన్స్ ను ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదు ?                               


 ప్రశ్నించేవారిని అరెస్ట్‌ చేస్తారా? ఇలానే చేసుకుంటే పోతే రెండు సీట్లకే పరిమితమవుతారని హెచ్చరించారు.  ఒప్పందం ప్రకారం సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌ అన్ని అందాయని చెబుతున్నారు.నిధులు గోల్‌మాల్‌ జరిగినట్టు నిరూపించలేకపోయారు. ఒక్క రూపాయి అయినా పక్కదారి పట్టిందని నిరూపించగలరా?. నాలుగేళ్లలో ఏ ఒక్కరోజైనా చంద్రబాబుకు నోటీసు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేకతను దృష్టి మళ్లించేందుకు జగన్‌ ప్రయత్నాలు చేస్తున్నారు.కోర్టుకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రస్నించారు.  వలం అవినీతి మరకను చంద్రబాబుకు అంటించాలనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారన్నారు. ఇలాంటి అక్రమ కేసులకు చంద్రబాబు, టీడీపీ భయపడదని, రాజకీయ రణక్షేత్రంలో వారిని ఎదుర్కొంటామన్నారు.                      


రాజకీయ రణక్షేత్రంలో పదింతల శక్తితో ఎదుర్కొంటాం !                            


 రేపు రాజకీయ రణక్షేత్రంలో పదింతల శక్తితో ఎదుర్కొంటామని..   ఆరోపణ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారు. ఓటమి భయంతోనే తెదేపాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. నిజాలు వెలుగులోకి వస్తాయనే సీమెన్స్‌ను పక్కన పెడుతున్నారని ఆరోపించారు.