Payyavula Keshav Took Charge As State Finance Minister: ఏపీ ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయం రెండో భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూజా కార్యక్రమాల అనంతరం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించిన అధికారులు విషెష్ చెప్పారు. రాష్ట్రంలోని వివిధ స్థానిక సంస్థలకు 15వ ఆర్ధిక సంఘం నిధుల విడుదల దస్త్రంపై మంత్రి తొలి సంతకం చేశారు. మొదటి విడతగా రూ.250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, కార్యదర్శులు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేస్తామన్న సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఎన్నికల హామీ మేరకు ఆ ఫైల్‌పైనే మంత్రి ఫస్ట్ సైన్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో పన్నులు విపరీతంగా పెరిగాయని.. దీంతో వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని.. ఆర్థిక పరిస్థితి సైతం దెబ్బతిందని అన్నారు. పన్నులు తక్కువగా ఉన్నాయని పొరుగు రాష్ట్రాల్లోనే వాహనాలు కొంటున్నారని చెప్పారు. ఆర్టీసీకి కూడా కర్ణాటక నుంచే డీజిల్ కొట్టించిన పరిస్థితి ఏర్పడిందన్నారు.


'రాష్ట్ర అభివృద్ధికి కృషి'


సీఎం చంద్రబాబు సారధ్యంలో రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఆదాయాలు పెరగాలంటే పన్నులు పెంచడమే మార్గం కాదని.. పన్నుల విస్తృతి పెంచాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా పార్టిషన్ రిజిస్ట్రేషన్ ఫీజు పెంచేశారని.. దీని వల్ల తెల్ల కాగితాల మీద పంపకాలు చేసుకుంటున్నారని అన్నారు. పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొనడం వల్ల ఇక్కడ ఆదాయం కోల్పోతున్నామని చెప్పారు. ఒక్క ఫార్చూనర్ కారు పక్క రాష్ట్రాల్లో కొనడం వల్ల ఏపీ రూ.16 లక్షల మేర ఆదాయం కోల్పోతుందని వివరించారు. పన్నులు పెంచడం ద్వారా రాబడి పెంచుకోవాలనే జగన్ విధానం వల్ల ఏపీలో వ్యాపారాలే లేకుండా పోయాయని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైందని.. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల మరికొన్నాళ్లు అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొందని అన్నారు.


Also Read: Chandrababu Bogapuram : 2026 కల్లా అందుబాటులోకి బోగాపురం ఎయిర్ పోర్టు - డెడ్ లైన్ ఫిక్స్ చేసిన చంద్రబాబు