Pawan Kalyan Wife: పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవాకు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెరిగిపోయారు. అన్నా లెజినెవా క్రైస్తవ మతస్థురాలైనప్పటికీ, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ సాంప్రదాయాలను గౌరవించిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. డిక్లరేషన్ ఫారమ్‌పై సంతకం చేయడం, తలనీలాలు సమర్పించడమే కాదు హిందూ సంప్రదాయాల పట్ల ఆమె చూపిన గౌరవం అందర్నీ ఫిదా చేసిందని అనుకోవచ్చు.
అన్నా లెజినెవా రష్యన్. ఆమె పుట్టి పెరిగినదంతా రష్యాలోనే. కానీ పవన్ కల్యాణ్‌తో వివాహం తర్వాత ఆమె భారతీయ సంస్కృతిని హృదయపూర్వకంగా స్వీకరించారు. హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ వస్తున్నారు. వారాహి వాహనానికి పూజ చేసినప్పుడు కానీ.. ఇతర కుటుంబ కార్యక్రమాల్లో కానీ ఆమె హిందూ సంప్రదాయాలను వందశాతం పాటిస్తారు. మతం, సంస్కృతి, దేశం వంటి హద్దులను అధిగమించి, మానవత్వం గొప్పతనాన్ని అన్నా లెజ్‌నోవా చాటి చెబతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అన్నా లెజినెవా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి. ఆమె తిరుమలకు వస్తున్నారంటే ఆమె వేసే ప్రతి అడుగును నిశితంగా పరిశీలిస్తారు. ఏ చిన్న అంశం దొరికినా వివాదాస్పదం చేస్తారు. కానీ ఆమె.. వ్యవహరించిన తీరు ప్రతి ఒక్క హిందువును చేతులెత్తి నమస్కరించేలా చేసిందని పలువురు అంటున్నారు. మానవీయ విలువలు, పరమత సహనం, భక్తి శ్రద్ధలతో పాటు సమాజ సేవలో తనను తాను ఒక ఆదర్శంగా నిలిపిన విధానం ప్రజలకు ఒక గొప్ప సందేశాన్ని అందించారని అంటున్నారు.
కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినందుకు కృతజ్ఞతగా చేసిన మొక్కు . ఇది కేవలం ఒక వ్యక్తిగత భక్తి కాదు, హిందూ సంప్రదాయాల పట్ల ఆమె చూపిన గౌరవం, సమాజంలో ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప సంకేతం అని అనుకోవచ్చని చెబుతున్నారు. మొత్తంగా పవన్ కల్యాణ్ సతీమణిపై ఇప్పటి వరకూ ఎవరైనా ఎలాంటి అభిప్రాయమైనా పెట్టుకుని ఉండవచ్చు కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా ఆమెను అభిమానించకుండా ఉండలేరని అంటున్నారు.