Pawan Kalyan Chit Chat On Veeramallu: హరిహరవీరమల్లు సినిమాలో రాజకీయాలు ఉండవని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదల సందర్భంగా  మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. హరిహరవీరమల్లు సినిమా లో  ఔరంగజేబు  అరాచకాలను ఎదురించే పాత్ర అన్నారు. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ సినిమా కధ నడుస్తుందన్నారు. నన్ను విశాఖ లో ఇబ్బంది పెట్టడం, చంద్రబాబు ను అరెస్టు చేయడం వంటి ఘటనలతో అప్పుడు‌ షూటింగ్ ఆలస్యం అయ్యిందన్నారు.

నిర్మాతలు నష్టపోయారు -అందుకే బాధ్యత తీసుకున్నా 

చారిత్రాత్మక నేపధ్యం కాబట్టి కొంత వర్కవుట్ చేశామని.. ఇందులో రాజకీయ అంశాలు లేవు... ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని స్పష్టం చేశారు. సినిమానా, రాజకీయాలా అంటే నా ప్రయారిటీ రాజకీయాలకేనని స్పష్టం చేశారు. అయితే తన  వల్ల నిర్మాత లు నష్టపోయారని.. నా సినిమాల ఆలస్యం వల్ల వారు బలైపోయారని అన్నారు. నైతిక బాధ్యత వహించి నేను వాటిని పూర్తి చేశాననని.. రెమ్యూనేషన్ గురించి ఆలోచన చేయలేదు... సినిమా పూర్తి చేయాలనే పని చేశాననన్నారు. 

ఎన్నో ఇబ్బందులు పడి ఇక్కడి దాకా వచ్చాం 

గత ప్రభుత్వం లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇక్కడి వరకు రావడం చాలా గ్రేట్ అనిపించిందని.. ప్రతి చిన్నపాటి పనికి ఒక చిన్న యుద్ధం చేయాల్సిందేన్నారు. జీవితం లో సంఘర్షణ అనేది ఒక భాగం..మచిలీపట్నం లో మొదలైన‌ కధ హైదరాబాదు, ఢిల్లీ వరకు నడుస్తుందని తెలిపారు.  ఊహజనితమైన కధ ఇది... చారిత్రక నేపధ్యంతో తీశాం.. ఆరోజుల్లో టిక్కెట్ తగ్గించారు.. ఈ ప్రభుత్వం పెంచేలా అవకాశం ఇచ్చారు.. ఇదంతా నా చేతిలో లేదు... అలా‌ జరిగింది అంతే అన్నారు. నా నిర్మాత లతో పాటు నేను కూడా నష్టపోయాను.. నేను రాజకీయాల్లో ఉన్నా కాబట్టి ఏ పరిస్థితులు అయినా ఎదుర్కొని నిలబడతానన్నారు. 

జానీ ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు నా ఇంటి మీదకు వచ్చారు ! 

మా కూటమి ఎమ్మెల్యే లు కోరితే... ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని తెలిపారు. సినిమా గ్లామరస్ గా కనిపిస్తుంది... జానీ దర్శకత్వం వహిస్తే ఆడలేదన్నారు. డిస్టిబ్యూటర్లు ఆనాడు నా ఇంటి మీదకు వచ్చారు..లాభాలు వస్తే నాకు అదనంగా డబ్బులు ఇవ్వరు కదా అనిపించింది.  మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక ఇబ్బందులు అనే భావన కలిగిందన్నారు. ఆ అనుభవం నన్ను బాగా బలంగా ఉండేలా చేసిందని.. 2019 ఎన్నికలలో ఓడిన సమయంలో ఆ అనుభవం తో నిలబడ్డానన్నారు. ఒకసారి నష్టం వస్తే ఇంతలా నాకు వ్యతిరేకంగా మాట్లాడతారా అని తెలిసిందన్నారు. 

క్లైమాక్స్ కు నేనే దర్శకత్వం వహించా ! 

ఎ ఎం రత్నం వంటి నిర్మాత ఎంతో కష్టపడి ఈ సినిమా తీశారు..ఆయనకు అన్ని విధాలా అండగా ఉండాలనే నేడు నిలబడ్డానని తెలిపారు. ఈ సినిమా క్లయిమాక్స్ ఎపిసోడ్ మొత్తం నేనే బాధ్యత తీసుకుని దర్శకత్వం వహించానన్నారు. నిర్మాత కష్టం చూసే రెమ్యూనేషన్ కూడా ఇంకా తీసుకోలేదని..ఈ సినిమా విజయవంతం అయ్యాక తీసుకుందామనుకున్నాన్నారు.పార్ట్ టూ ఇరవై శాతం‌ షూటింగ్ పూర్తి చేశాం చిత్ర పరిశ్రమ ఎక్కడ ఉన్నా ఒకె..‌కానీ ఏపిలో షూటింగ్ లకు అనువుగా  మౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు.