గంజాయి స్మగ్లింగ్ అనేది సామాజిక ఆర్థిక అంశమని పవన్ కల్యాణ్ మరోసారి ట్వీట్ చేశారు. ఈ అంశాన్ని తాను 2018నుంచి హైలెట్ చేస్తున్నాననని గుర్తు చేశారు. ఆంధ్రా-ఒరిస్సా బోర్డర్‌లో ఇది గత పదిహేను, ఇరవై ఏళ్ల నుంచి ఉన్న సమస్యని.. ఒక్క సారిగా వచ్చి పడింది కాదన్నారు. అయితే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గంజాయి స్మగ్లింగ్ విపరీతంగా పెరిపోయిందన్నారు.
Also Read : నిన్న నాగార్జున.. ఇవాళ దిల్ రాజు బృందం ! ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్ చర్చలే చర్చలు !
ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ గంజాయి మాఫియాకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని జనసేనాని స్పష్టం చేశారు. ఇందు కోసం కఠినమైన చట్టాలు చేయడంతో పాటు గిరిజన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. ఈ రెండు సమాంతరంగా జరిగితేనే .. వేల కోట్లుగా రూపాంతరం చెందిన గంజాయి సమస్య నుంచి బయటపడతామన్నారు.
Also Read : సూపర్ స్టార్ రజినీ హెల్త్‌పై భార్య కీలక ప్రకటన.. ఆరోగ్యం ఎలా ఉందంటే..
ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి సమస్య ఇప్పుడు రాజకీయం అయింది. ప్రభుత్వంపై విపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ఏపీ నుంచి వస్తున్న గంజాయిని ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాు, ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారు. దీంతో గంజాయి కేపిటల్‌గా ఏపీ మారిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై రేగిన రాజకీయ దుమారం, విమర్శలు - ప్రతి విమర్శల వల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపై దాడులు చేశారు. పట్టాభి ఇంట్లో విధ్వంసం సృష్టించారు.
Also Read : పొత్తులపై మాట్లాడటానికి వాళ్లెవరు..? రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్న సీఎం రమేష్ !
ఇప్పుడు పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై దృష్టి పెట్టారు. రెండు రోజుల నుంచి వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. గతంలో తాను ఒరిస్సా-ఆంధ్రా బోర్డర్‌లో పర్యటించినప్పుడే గుర్తించానని ప్రకటించారు. ఇటీవలి వరకు గంజాయి సమస్య ఇప్పటిది కాదని చెబుతూ వచ్చిన పోలీసులు ఇప్పుడు మనసు మార్చుకున్నారు. త్వరలో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ సవాంగ్ ప్రకటించారు. కావాలంటే ఎన్‌ఐఏ సాయం తీసుకుంటామన్నారు. త్వరలో విశాఖలో ఇతర రాష్ట్రాల పోలీసులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.