Bronchoscope : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడటంతో బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారని తెలిపార. బ్రాంకోస్కోప్ (Bronchoscope) అనేది ఒక వైద్య పరికరం. ఇది ఊపిరితిత్తులు , శ్వాసనాళాల లోపలి భాగాన్ని పరిశీలించడానికి ఉపయోగిస్తారు. అగ్నిప్రమాదంలో ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లిందని పవన్ కల్యాణ్‌కు ఆస్పత్రి వర్గాల నుంచి సమాచారం వచ్చింది.
బ్రాంకో స్కోప్ సన్నని ట్యూబ్ రూపంలో ఉంటుంది, దీని చివరన కాంతి , కెమెరా లేదా లెన్స్ ఉంటాయి. ఈ పరికరాన్ని నోటి లేదా ముక్కు ద్వారా శ్వాసనాళాల్లోకి పంపి, ఊపిరితిత్తుల స్థితిని చూడటానికి ఉపయోగిస్తారు. దీని ద్వారా కొన్ని చికిత్సలు కూడా చేస్తారు. ఈ ప్రక్రియను "బ్రాంకోస్కోపీ" అంటారు. ప్రస్తుతం మార్క్ శంకర్ కు బ్రాంకో స్కోపీ చేస్తున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు.
బ్రాంకో స్కోపీని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఊపిరి తిత్తుల్లో ఇన్ఫెక్షన్, క్యాన్సర్, ఇతర అసాధారణతలను గుర్తించడానికి ఉపయోగిస్తారు. దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, లేదా రక్తం కక్కడం వంటి లక్షణాల కారణాలను తెలుసుకోవడానికి కూడా బ్రాంకో స్కోపిని వైద్యులు ప్రిఫర్ చేస్తారు. టెస్టుల కోసం ఊపిరితిత్తుల నుండి కణాలు లేదా బయాప్సీ నమూనాలను సేకరించి పరీక్షించడానికి ఉపయోగపడుతుంది.
అలాగే కొంత మంది చిన్న పిల్లలు ఏదైనా పొరపాటున మింగేసినా.. శ్వాసనాళాల్లో అడ్డుకున్న వస్తువులను తొలగించడానికి బ్రాంకోస్కోపీ ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావాన్ని ఆపడానికి లేదా కణితులను తగ్గించడానికి... కొన్ని సందర్భాల్లో, స్టెంట్‌లను ఉంచడం లేదా లేజర్ చికిత్స చేయడం ద్వారా శ్వాసనాళాలను తెరవడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని మెడికల్ జర్నల్స్ చెబుతున్నాయి. బ్రాంకోస్కోపి చేయాలంటే సాధారణ అనస్థీషియా ఇచ్చి, బ్రాంకోస్కోప్‌ను శ్వాసనాళాల్లోకి పంపుతారు. ఈ విధానంలో వచ్చే ఫలితాలను బట్టి తదుపరి చికిత్స నిర్ణయిస్తారు.
బ్రాంకో స్కోప్ ట్రీట్ మెంట్ గురించి వివరిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇవి ఎంత కీలకమో ఈ వీడియోలు చూస్తే అర్థమవుతుంది.
కొంత మంది డాక్టర్లు కూడా ఈ క్లిష్టమైన పరీక్ష గురించి ట్వీట్లు పెట్టారు.