Yuvagalam Pawan Speech :  టీడీపీ, జనసేన మైత్రిని చాలా కాలం పాటు కాపాడుకోవాల్సి ఉందని  జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు.  
యువగళం సభకు నన్ను ఆహ్వానించాలని ప్రతిపాదన వచ్చినప్పుడు ..  220రోజులు, 97 నియోజకవర్గాల్లో 3వేలకు పైగా చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు లోకేష్ తెలుసుకున్నారన.ి.   ఇది లోకేష్ గారి రోజు.. అటు వంటి సభలో నేను ఉండటం సబబా అని అడిగానన్నారు. అయితే  
లోకేష్ గారు, చంద్రబాబు ఆహ్వానం మేరకు నేను మనస్పూర్తిగా ఇక్కడకు వచ్చాననని తెలిపారు.  ఈ పాదయాత్ర జగన్ చేసిన లాంటి పాదయాత్ర కాదన్నారు. 


కష్టాలు తెలుసుకున్న పాదయాత్ర.. మాటలతో చెప్పే పాదయాత్ర కాదు.. చేతలతో చూపించిన పాదయాత్ర అని ప్రశంసించారు.  అటువంటి పాదయాత్ర చేసిన లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని..  నేను నడుద్దాం అంటే... నన్ను నడవనిచ్చే పరిస్థితి ఉండదన్నారు.  పాదయాత్ర ద్వారా చాలా మంది సాధకబాధకాలు తెలుసుకు అవకాశం ఉంటుందని..  నాకు అటువంటి అవకాశం లేకపోవడం కొంత బాధగా కూడా ఉందన్నారు.  ఎపీ స్పూర్తి నేడు భారతదేశానికే చేలా కీలకమని..   భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయంటే పొట్టి శ్రీరాములు బలిదానం కారణమన్నారు.  ఆయన స్పూర్తి వల్లే ఎపీ అవతరించింది.  ఐ.ఎ.యస్ లు, ఐపీయస్ లు ఉమ్మడి ఎపీలోకి రావాలని తెగ కోరుకునే వారు .. 
ఎపీ ఒక మోడల్ స్టేట్ అని, అందరూ అక్కడ పని చేయాలని బావించే వారు... నేడు ఎపీకి ఎందుకు వెళ్లకూడదో చెప్పే పరిస్థితికి జగన్ తీసుకు వచ్చారన్నారు. 


చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు  తనకు చాలా బాధ కలిగిందన్నారు.  కష్టాలు చూసిన వాడిని, దగ్గర నుంచి చిన్నప్పుటి నుంచి బాధలు పడిన వాడినని గుర్తు చేశారు.  ఓటమి ఎదురైతే ఎలా ఉంటుందో భరించిన వాడినన్నారు.  చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆవేదన, భువనేశ్వరి బాధ చూశాను  నేను ఏదీ ఆశించి టీడీపీకి, చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేదు..  జైల్లో ఆయన చూసిన తర్వాత బయటకు వచ్చి మద్దతు ప్రకటించాను.. సుదీర్ఘ రాజకీయ అనుభవం, జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపిన వ్యక్తి చంద్రబాబు..  అటువంటి వ్యక్తిని అన్యాయంగా జైలుకు పంపడం బాధ కలిగించిందన్నారు. 


కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పులకు సోనియా గాంధీ జగన్ ను జైల్లో పెట్టించారుని..  ఆ కక్ష  చంద్రబాబు పై చూపించడం జగన్ అవివేకానికి నిదర్శనమన్నారు.  విభజన జరిగిన నాటి నుంచి హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ప్రకటించారు.  ఎపీకి సరైన పంపకాలు జరగకుండా విభజన జరిగింది.  అందుకే ఆనాడు  నేను పోటీ నుంచి విరమించుకుని బీజేపీ, టీడీపీకి మద్దతు ఇచ్చాను. దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనే ఆనాడు వారితో కలిసి నడిచానని తెలిపారు.  టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు సమన్వయం లోపం, కారణంగా పొత్తు ముందుకు తీసుకెళ్లలేకపోయామన్నారు. 


ఆ ప్రభావం వల్లే 2019 లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.  దశాబ్దం పాటు అనుభవం ఉన్న రాజకీయ నేత సీఎంగా ఉండాలని అనుకున్నా.. కొన్ని పరిస్థితుల వల్ల సాధ్యపడలేదన్నారు.  2024 ఎన్నికలల్లో మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం.. జగన్ ను ఇంటికి పంపిచేస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నామన్నారు.  వైసీపీ ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 80 మందిని మారుస్తారంట
అసలు మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.., జగన్ నే ముందు మార్చాలన్నారు.  అధికారంలోకి రాగానే.. కూల్చివేతలతో జగన్ పాలన ప్రారంభించాడు.. అన్యాయమని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టాడు... ఇలాంటి ప్రభుత్వం చూస్తానని, ఉంటుందని నేను ఊహించలేదనన్నారు. 


జగన్ గెలవగానే. మంచి ప్రభుత్వం తో పాలన చేయండి.. మేము సహకరిస్తామని నేను అభినందనలు చెప్పానని.. కక్ష సాధింపు రాజకీయాలతోనే జగన్ అందరినీ బూతులు తిట్టించాడని విమర్శించారు.  వైయస్ తో సహా అందరూ నాయకులను తిట్టారేమో కానీ.. బయటకు రానీ తల్లులను నీచంగా విమర్శించే సంస్కృతి జగన్ నాయకత్వంలో ఈ వైసీపీ నాయకులు అమలు చేశారన్నారు.  వాలంటీర్ల వ్యవస్థ ను అడ్డం పెట్టుకుని ఒంటరి మహిళల డేటాను సేకరించేలా చేశారు.. నన్ను మాట్లాడమని కొంతమంది చెబితే.. నేను డేటాను తెప్పించుకుని చూసి ఆశ్చర్యపోయానన్నారు.  
కొంతమంది వాలంటీర్లు చేసే విధానాల వల్ల  ఒంటరి మహిళలు, వితంతువులు చాలా అన్యాయానికి గురవుతున్నారని అన్నారు. 


నేను ఎప్పుడు  గొంతు  ఎత్తినా... ఓట్లు కోసం కాదు. మార్పు కోసం పని చేస్తానన్నారు.   వారాహి యాత్ర చేస్తే  నాపై అనేక కువిమర్శలు చేశారు
విశాఖలో పోలీసులతో అడ్డుకునేలా చేసి.. ఒక ఉన్నతాధికారి నాపై నీచంగా వ్యవహరించారు.  అన్ని శాఖలకు పెద్ద మనిషి అయినా ఓ వ్యక్తి ఆ పోలీసు అధికారికి ఆదేశాలు ఇస్తున్నాడు.  సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇలా పరిస్థితి ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటి.  మరోసారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రజలు బతకలేరన్నారు.   పెట్టుబడులు రావు.. పరిశ్రమలు ఉండవు..ఎవరూ ఎపీలోకి రారు. ఇప్పటం సభలోనే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వను అని ప్రకటించానని గుర్తు చేశారు.  


చిన్నపాటి సినిమా టిక్కెట్లు విషయంలో కూడా ఛీఫ్ సెక్రటరీ నుంచి ఎమ్మార్వోల వరకు వాడి వ్యవస్థలను దుర్వినియోగంచేస్తున్నారని..   ఈ పరిణామాలను వివరించి.. అమిత్ షా కే నేరుగా నా అభిప్రాయలను వివరించానన్నారు.   ఎపీ భవిష్యత్ బాగుండాలంటే.. మనమే కొట్లాడాలి.. ఎవరి కోసమో ఎదురు చూడకూడదనియ..  టీడీపీ, జనసేన పొత్తు ఈ ఎన్నికలలో చాలా కీలకమైనందన్నారు.   వైసీపీ వాళ్లు వస్తే కొండలు,కోనలు దోచుకుంటారని 2019 ముందు కూడా చెప్పాను అదే జరుగుతోందన్నారు.  


త్వరలోనే జనసేన, టీడీపీ ఉమ్మడి మ్యానిఫెస్టో ను ప్రకటిస్తామని..  ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలు, యువత, మహిళలు అందరికీ మేలు చేసేలా పాలన సాగిస్తామన్నారు.  పంచాయతీల బలోపేతం, దళితులు, మత్స్యకారులు, చేనేత కార్మికులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  సంఖ్యా బలం లేని బీసీ కులాలకు అండగా ఉండేలా ఎక్సైసైజ్ చేస్తున్నామని..   చంద్రబాబుగారు, మేము , కలిసి మాట్లాడుకుని త్వరలోనే మరో సభలో ప్రకటిస్తామన్నారు.  ఇది లోకేష్ సభ కాబట్టి.. పరిమితంగానే మాట్లాడుతున్నానని..  ఈ మైత్రి , ఈ స్పూర్తి అందరం సమిష్టగా చాలా సంవత్సరాల పాటు కాపాడుకోవాలని ఆశిస్తున్నానన్నారు.  హలో ఎపీ... బైబై వైసీపీ .., అనేది ప్రజలంతా గుర్తు పెట్టుకోవాలన్నారు.   టీడీపీ, జనసేన పొత్తుకు బీజేపీ అధినాయకత్వం కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నానని పవన్ స్పీచ్ ముగించారు.