Pawan Kalyan On Chandrababu : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును రాజకీయ కక్ష సాధింపుల కోసమే అరెస్ట్ చేశారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పవన్ కల్యాణఅ ప్రశ్నించారు. చంద్రబాబుకు నా సంపూర్ణ మద్దతు- ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనన్నారు.  చంద్రబాబు అరెస్టును ఖండించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని  ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి అరెస్ట్ సరి కాదుని స్పష్టం చేశారు.  ఏ తప్పూ చేయని జనసేన నాయకులపైనా హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు.  చంద్రబాబుపై నంద్యాలలో ఘటనకూడా అలాంటిదే నన్నారు.  చంద్రబాబుపై చిత్తూరు, నంద్యాల ఘటనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వమే వ్యవహరిస్తోందని మండిపడ్డారు.  వైసీపీ అధికారంలో ఉండటం వల్లే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు.  





లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చెయ్యాల్సింది పోలీసులైతే.. వైసీపీ వాళ్లు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని పవన్ ప్రశ్నించారు. వైసీపీ నేతలైతే.. విదేశాలకు కూడా వెళ్లవచ్చనీ, అదే టీడీపీ నేతను అరెస్టు చేస్తే, కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదా అని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబుకి తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని పవన్ తెలిపారు. దీని నుంచి చంద్రబాబు త్వరగా బయటపడాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు. 


చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని ఇతర పార్టీలు కూడా మండిపడ్డాయి.   ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి  తీవ్రంగా ఖండించారు. ఏపీ సీఐడీ పోలీసులు శనివారం తెల్లవారు జామున మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేసిన విధానం సమర్థనీయం కాదన్నారు. ఈ దుశ్చర్య దురదృష్టకరం, దుర్మార్గం, దౌర్జన్యం అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్రా జకీయ కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అని తెలిపారు. ఇది రాజ్య హింస అన్నారు. ఈ దుశ్చర్యను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని చెప్పారు. రాహుల్‌ గాంధీ  విషయంలో కానీ.. మణిపూర్ విషయంలో కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని చంద్రబాబు కానీ, టీడీపీ నాయకులు ఖండించక పోయినప్పటికీ చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.                 


బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు మాత్రమే చేసి..  అరెస్టులు చేయడం ఏమిటని.. కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.