Elephants Attack : పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలు, పశువులపై దాడులు చేస్తున్నాయి. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరమడంతో పాలకులు, ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫారెస్టు అధికారులను గృహ నిర్బంధం చేశారు. కొమరాడ మండలం రావికర్ర వలసలో ఏనుగులు సంచారిస్తున్నాయి.  ఏనుగుల గుంపు దాడిలో రెండు ఆవులు మృతి చెందాయి. ఏనుగుల గుంపు భారీగా పంటలను నాశనం చేశాయి. ఏనుగులు తరలించడంలో పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహంతో రావికర్ర వలస గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులను ఓ ఇంట్లో నిర్బంధించారు. ఐదేళ్లుగా ఏనుగుల గుంపు వల్ల ప్రాణ నష్టం, పంట నష్టం జరుగుతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. 



ఆవులపై ఏనుగుల గుంపు దాడి 


పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఏనుగులు హల్ చల్ చేశాయి. రాయికర్రవలస గ్రామంలో మూగ జీవాలపై ఏనుగుల గుంపు దాడికి పాల్పడింది. గజరాజుల సంచారంతో  స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏనుగుల గుంపు సంచారంపై అటవీశాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమాచారం అందించిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గ్రామానికి వచ్చిన ఫారెస్ట్ అధికారులను గ్రామస్తుల ఓ ఇంట్లో బంధించారు. ఏనుగుల దాడిలో రెండు మూగజీవాలు మృతి చెందాయి. మరో ఆవుకు తీవ్ర గాయాలయ్యాయని గ్రామస్తులు తెలిపారు. ఆవులు మృతి చెందడానికి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆందోళన వ్యక్తం చేస్తూ గ్రామస్తులు అటవీశాఖ అధికారులను ఓ ఇంట్లో బంధించారు. జిల్లా నుంచి ఏనుగులను తరలించే వరకు అటవీ శాఖ సిబ్బందిని విడిచిపెట్టబోమని గ్రామస్తులు అంటున్నారు. 


పలమనేరులో ఏనుగుల గుంపు హల్ చల్ 


చిత్తూలు జిల్లా పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు వద్ద ఇటీవల 22 ఏనుగుల గుంపు హల్ చల్ చేశాయి. విపరీతమైన మంచి కురుస్తుండగా కొంతమంది గ్రామస్తులు తమ మొబైల్ ఫోన్ లో గజరాజులను చిత్రీకరించారు. ఏనుగుల గుంపు గ్రామాల వైపు వస్తుందేమోనని అరుపులతో అటవీ మార్గంలోకి తరమడంతో ఓ మదఫుటేనుగు ఘీంకరిస్తూ గ్రామస్తులను వెంబడించింది.  అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు గ్రామస్తులు. 30 నిమిషాల పాటు రోడ్డుపైనే అటు ఇటు తిరుగుతూ ఏనుగుల గుంపు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి. అటు పక్క గుడియాత్తం నుంచి వచ్చే వాహనదారులు ఇటు పలమనేరు నుంచి వెళ్లే వాహనదారులు ఏనుగులు వెళ్లే వరకు వేచి చూశారు. తమ గ్రామాల వైపు ఏనుగుల గుంపు వస్తే  పిల్లలు, వృద్ధులు పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గ్రామాల వైపు ఏనుగులు రాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి తరచూ ఏనుగుల గుంపు గ్రామాలపై దండయాత్ర చేస్తున్నాయి. గ్రామాల్లోకి చొరబడుతున్న ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. పంటలతో పాటు పశువులపై దాడికి పాల్పడుతున్నాయి. ఏనుగుల గుంపులను అటవీ ప్రాంతంవైపు మళ్లించాలని, అందుకు అటవీ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.