Happy Birthday YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 50వ బర్త్ డే సందర్భంగా వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రేమను చాటుకుంటున్నారు. దాదాపు లక్షమంది రక్తదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. 


IRCS సహకారంతో, వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా వింగ్ సభ్యులు ఆన్‌లైన్‌లో 'రక్తదానం కోసం ప్రతిజ్ఞ' కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వేడుకలకు 72 గంటల ముందు నుంచి లక్ష మందికి పైగా వ్యక్తులు రక్తదానం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. రక్త దానానికి సంబంధించి IRCS నుంచి బ్లడ్ డొనేషన్ కు సంబంధించిన ధృవీకరణ పత్రాన్ని అందుకున్నారు.


రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు క్రీడలు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొక్కలు నాటడంపై డ్రైవ్‌లు, పేదలకు అన్నదానం వంటి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. బర్త్‌డే సందర్భంగా మూడు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైసీపీ పిలుపునిచ్చింది. ఈ మేకు సోమవారం, మంగళవారం, బుధవారం కార్యక్రమాలు చేపట్టారు వైసీపీ కార్యకర్తలు. సోమవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో క్రీడాపోటీలు నిర్వహించారు. మంగళవారం ఆయా నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో వైసీపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 


బుధవారం మాత్రం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా రక్తదానం చేయాలని సంకల్పించారు. ఈ మేరకు భారీ సంఖ్యలో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి వైసీపీ సోషల్‌ మీడియా వింగ్ ప్రచారం నిర్వహిస్తోంది. దీని మంచి రెస్పాన్స్ వచ్చిందని వైసీపీ లీడర్లు చెబుతున్నారు. 


రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్ సీపీ మద్దతుదారులు, లబ్దిదారులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సీఎం చిత్రాలు మరియు ప్రత్యేక వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. వాట్సప్ స్టేటస్ గా పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో #HBDYSJAGAN ట్రెండింగ్ అవుతుతోంది